Mega Job Mela: నిరుద్యోగులకు డిప్యూటీ స్పీకర్ గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా!

డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గౌడ్ మాత్రం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించబోతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Expected Jobs

Jobs employment

బీఆర్ఎస్ నాయకులంతా ఆత్మీయ సమ్మేళనాలతో బిజీగా ఉంటే, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గౌడ్ మాత్రం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించబోతున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 7న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. 25కి పైగా కంపెనీలు హాజరవుతున్న ఈ కార్యక్రమంలో దాదాపు 2,000 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. హైదరాబాద్ సీతాఫల్మండి మల్టీపర్పస్ హాల్‌లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు గౌడ్ ట్విట్టర్‌లో తెలిపారు.

“పలు జాబ్ ఏజెన్సీల సహకారంతో SETWIN నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో 25కి పైగా సంస్థలు పాల్గొనే అవకాశం ఉంది. 2 వేల మందికి పైగా నిరుద్యోగ యువతకు వారి వారి అర్హతలను బట్టి ఉద్యోగాలు కల్పిస్తాం. మంచి జీతంలో జాబ్స్ ఆఫర్ చేస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. నిరుద్యోగులు, విద్యార్థులు ఏప్రిల్ 7న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్: 9985122244.

Also Read: SSC Hindi Leaked: తెలంగాణలో లీకుల పర్వం.. టెన్త్ హిందీ పేపర్ సైతం లీక్!

  Last Updated: 04 Apr 2023, 12:48 PM IST