Site icon HashtagU Telugu

Prajabhavan : ముగిసిన బాబు – రేవంత్ ల సమావేశం..ఫైనల్ గా డిసైడ్ చేసింది ఇదే..

Cm Meeting End

Cm Meeting End

హైదరాబాద్ ప్రజాభవన్లో (Praja Bhavan) తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి (Chandrababu & Revanth Reddy) భేటీ పూర్తయింది. ముందుగా జూబ్లీహిల్స్ నివాసం నుండి ప్రజాభవన్ కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు కు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం రేవంత్.. చంద్రబాబుకు కాళోజీ నారాయణరావు రచించిన ‘నా గొడవ’ పుస్తకాన్ని బహూకరించారు. ఆ తర్వాత చంద్రబాబు ఏపీ ప్రభుత్వం తరుపున వెంకటేశ్వర స్వామి చిత్రపటంతో ఉన్న జ్ఞాపికను సీఎం రేవత్, డిప్యూటీ సీఎం భట్టి లకు అందజేశారు. అనంతరం వారిరువురిని శాలువతో సత్కరించారు.

We’re now on WhatsApp. Click to Join.

అనంతరం సమావేశం మొదలుపెట్టారు. దాదాపు రెండు గంటల పాటు విభజన అంశాల పరిష్కారంపై చర్చించారు. 10 ఏళ్లుగా పరిష్కారం కాని రాష్ట్ర విభజన సమస్యలపై పరిష్కారానికి ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు కమిటీలు ఏర్పాటు చేయాలని భేటీలో నిర్ణయించారు. మంత్రులతో ఓ కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని రెండు రాష్ట్రాల సీఎంలు నిర్ణయం తీసుకున్నారు. మంత్రుల కమిటీలో తెలంగాణ నుంచి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఉండే అవకాశం ఉంది.

ఇక భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్ లో కలిసిన 7 మండలాల్లోని 5 గ్రామాలను తెలంగాణ లో కలపాలని సీఎం రేవంత్ చంద్రబాబును అడిగినట్లు తెలుస్తోంది. ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు పంచాయతీలను అడిగినట్లు సమాచారం. దీనిపై కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని TG సర్కారు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే హైదరాబాద్ లోని కొన్ని భవనాలు తమకు కేటాయించాలని చంద్రబాబు కోరగా.. రేవంత్ సర్కారు తిరస్కరించినట్లు తెలుస్తుంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, వేంనరేందర్‌రెడ్డి, వేణుగోపాల్, సీఎస్ హాజరుకాగా, ఏపీ నుంచి చంద్రబాబుతో పాటు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేష్, సీఎస్ పాల్గొన్నారు.

Read Also : India vs Zimbabwe 1st T20I Match : యువ భారత్ కు షాక్…జింబాబ్వే స్టన్నింగ్ విక్టరీ