Rice Atm : పని కోసం ప్రయత్నించు.. పస్తులుంటే నన్ను సంప్రదించు!

కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది ఇబ్బందుల పాలయ్యారు. ముఖ్యంగా వలస కూలీలు, పేదలు, అడ్డా కూలీలు నిత్యం ఇబ్బందులు పడ్డారు. కనీసం ఒక్క పూట కూడా తిండి దొరక్క అర్దాకలితో అలమటించినవాళ్లు ఎంతోమంది.

  • Written By:
  • Publish Date - November 7, 2021 / 12:00 PM IST

కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది ఇబ్బందుల పాలయ్యారు. ముఖ్యంగా వలస కూలీలు, పేదలు, అడ్డా కూలీలు నిత్యం ఇబ్బందులు పడ్డారు. కనీసం ఒక్క పూట కూడా తిండి దొరక్క అర్దాకలితో అలమటించినవాళ్లు ఎంతోమంది. అలాంటివాళ్ల బాధలను చూసి చలించిపోయాడు హైదరాబాద్ కు చెందిన దోసపాటి రాము. పేదల కోసం ఆకలి తీర్చడం కోసం లక్షలు ఖర్చు చేసి ఎంతోమంది ఆకలి తీర్చాడు. ఈయన గురించి తెలుసుకుంటే మనుషుల్లో కూడా మహాత్ముడు ఉన్నారంటారు ఎవరైనా.

దోసపాటి రాము… తన సొంత జేబులో నుంచి సుమారు రూ. 52 లక్షలు ఖర్చు చేశాడు. హైదరాబాద్‌కు చెందిన నలభై మూడేళ్ల హెచ్‌ఆర్ మేనేజర్ తన ప్రావిడెంట్ ఫండ్‌లో కొంత భాగాన్ని విత్‌డ్రా చేసి, తన క్రెడిట్ కార్డును స్వైప్ చేసి, తన భూమిని అమ్మగా వచ్చిన డబ్బును పేదలకు ఖర్చు చేస్తున్నాడు. రైఎస్ ఏటీఎం కోసం అతను తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి పెద్ద అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లాలనే తన కలను కూడా వదులుకోవలసి వచ్చింది. లాక్‌డౌన్ నెలల్లో నిరుపేదల కోసం ఏర్పాటు చేసిన తన 24/7 ‘రైస్ ATM’ వేలాది మంది పేదల ఆకలి తీర్చిందని, అదే నాకు పదివేలు అని ఆయన అన్నారు.

2006లో దోసపాటి రాము ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం నుంచి కాపాడాలని దేవుడ్ని వేడుకున్నారు. బతకడానికి ఇంకో అవకాశం ఇస్తే, తన జీతంలో 70 శాతం పేదలకు సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. పూర్తిగా కోలుకున్న తర్వాత, హెల్మెట్‌లు/సీట్ బెల్ట్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి వివిధ అవగాహన కార్యక్రమాలలో పాల్గొనడం ప్రారంభించాడు. రక్తదానంపై అవగాహన, ఇంట్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేయడం మొదలైన వాటిపై ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. లాక్ డౌన్ సమయంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందు దోసపాటి రాము టెలివిజన్ రియాలిటీ షో స్ఫూర్తితో ప్రజలను 21 రోజుల పాటు ఇంటి లోపల ఉండాలని సవాలు చేసి కరోనా వ్యాప్తిని అడ్డుకట్టాడు.

దోసపాటి రాము రైస్ ఏటీఎం ఏర్పాటుచేయడానికి ఓ బలమైన కారణం కూడా ఉంది. ఓ రోజు రాము చికెన్ దుకాణం బయట వేచి ఉండగా, సమీపంలోని భవనంలోని వాచ్‌మెన్ భార్య రూ. 2,000కి చికెన్ కొనడం చూశాడు. ఆరా తీస్తే, ఆమె, ఆమె కోడలు ఒడిశా నుండి భోజనం చేయలేని వలస కార్మికులకు ఆహారం అందిస్తున్నారని చెప్పారు. “లక్ష్మమ్మ కేవలం రూ. 6,000 సంపాదిస్తోంది. ఆమె ఆ రోజు రూ. 2,000 ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంది. నేను మంచి జీతం తీసుకుంటాను, నా కుటుంబం సుఖంగా ఉంది. అవసరమైన వారికి సహాయం చేయకుండా నన్ను ఏదీ అడ్డుకోలేదని తెలుసుకొని వెంటనే రైస్ ఏటీఎం ఏర్పాటు చేశాడు.

తన అపార్ట్ మెంట్ వద్ద వాచ్‌మెన్ సహాయంతో 24×7 రైస్ ATMని ప్రారంభించాడు. “ప్రారంభంలో ఇది కేవలం 193 మంది మాత్రమే రెగ్యులర్ బియ్యం, కూరగాయలు తీసుకునేవాళ్లు. ఆ తర్వాత సంప్రదించే వారి సంఖ్య పెరగడం ప్రారంభమైంది. కిరాణ సామాగ్రితో పాటు మందులు, పాలు, కూరగాయలు కూడా పంపిణీ చేశాను. నా క్రెడిట్ కార్డ్ తో కూడా ఖర్చులు భరించలేకపోయాను. ఇవన్నీ ఖర్చులను భరించేందుకు నా ప్రావిడెంట్ ఫండ్ నుంచి రూ. 5 లక్షలు విత్‌డ్రా చేశా, ”అని అన్నాడు రాము. రైస్ ఏటీఎం ద్వారా పేదలు, వలస కార్మికులు, కూలీలు వేలాదిమంది ఆకలి తీర్చుకున్నారు. ఇప్పటికే ఎంతోమందికి సాయం చేస్తున్నాడు దోసపాటి రాము.