Site icon HashtagU Telugu

Suhasini: రేవంత్ రెడ్డితో నందమూరి సుహానిసి భేటి..కాంగ్రెస్ లోకి వస్తారా ?

Meet Nandamuri Suhasini with Revanth Reddy

Meet Nandamuri Suhasini with Revanth Reddy

Nandamuri Suhasini: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని దివంగత నందమూరి హరికృష్ణ కూతురు, టిడిపి(tdp) నాయకురాలు నందమూరి సుహాసి(Nandamuri Suhasini)ని కలిశారు. ఈ ఉదయం ఆమె రేవంత్ నివాసానికి వెళ్లారు. రేవంత్ కు పుష్పగుచ్ఛం అందించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో ఆమె రేవంత్ ను కలిశారు. లోక్ సభ ఎన్నికల సమయంలో రేవంత్ ను సుహాసిని కలవడం ఆసక్తికరంగా మారింది. 2018 ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా టిడిపి తరపున కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి సుహాసిని పోటీ చేశారు. సుహాసిని ప్రస్తుతం తెలంగాణ టిడిపి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి కారు దిగి హస్తం గూటికి చేరుకోగా.. ఇవాళ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్, దీపాదాస్ కండువా కప్పి విజయలక్ష్మీని పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా కారు దిగి హస్తం గూటికి చేరారు. దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: No Holiday : ఈ సండే రోజు వర్కింగ్ డే.. ఏప్రిల్ 1 నుంచి ఈ-ఇన్సూరెన్స్