Hyderabad Rape: మీర్‌పేట అత్యాచార సమగ్ర నివేదిక కోరిన తమిళిసై

మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నందనవనం కాలనీలో 56 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.తల్లి దండ్రులు లేకపోవడంతో బాలికతో పాటు సోదరుడు బంధువుల ఇంట్లో ఉంటున్నారు.

Hyderabad Rape: మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నందనవనం కాలనీలో 56 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తల్లి దండ్రులు లేకపోవడంతో బాలికతో పాటు సోదరుడు బంధువుల ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఎనిమిది మంది కీచకులు ఇంట్లోకి వెళ్లగా.. ముగ్గురు నీచులు బాలికపై సామూహిక హత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరారు. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రాచకొండ కమిషనర్‌ను ఆమె కోరారు. భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ , రంగారెడ్డి జిల్లా శాఖ, బాధితురాలి ఇంటిని సందర్శించి, ఆమె కుటుంబానికి అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలని ఆమె కోరారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం సఖి కేంద్రానికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఏడు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులను పట్టుకునే ప్రయత్నంలో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ కేసులో నలుగురు అనుమానితులను మీర్‌పేట పోలీసులు విచారిస్తున్నారు. నిందితులు గంజాయి మత్తులో ఉన్నట్లు తెలిపారు. వీరిలో ఇద్దరు రౌడీ షీటర్లు కూడా ఉన్నారు.

Also Read: BRS Game : కేసీఆర్ తురుపుముక్క‌లు ఎర్ర‌న్న‌లు..!