వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి చెందినట్లు నిమ్స్ వైద్యులు ప్రకటించారు.గత నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడిన డాక్టర్ ప్రీతి ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఎంజీఎంలో సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులు తట్టుకోలేక నాలుగురోజుల క్రితం ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విధులు నుంచి వచ్చిన తరువాత ప్రీతి అనుమానస్పదస్థితిలో పడి ఉండటాన్ని గమనించిన తోటి విద్యార్థినులు ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నిమ్స్‌కు ప్రీతిని తరలించి చికిత్స అందించారు. ప్రీతి ఆత్మహత్యాయత్నంపై పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఆరోపణలు నేపథ్యంలో సైఫ్‌ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.
ఆదివారం రాత్రి 9.10 గంటలకు ప్రీతి చనిపోయినట్లు నిమ్స్ వైద్యులు ప్రకటించారు. దీంతో నిమ్స్ వద్దకు పెద్ద ఎత్తున విద్యార్థి, గిరిజన సంఘాల నాయకులు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఇటు నిమ్స్ ఐసీయూ దగ్గర ప్రీతి తల్లిదండ్రుల ఆందోన చేపట్టారు. ప్రీతి మృతదేహాన్ని చూసేందుకు రావాలని ప్రీతి తల్లిదండ్రులను లోపలికి పిలిచిన డాక్టర్లు పిలిచారు. అయితే ప్రీతి ఎలా చనిపోయిందో తెలియకుండా లోపలికి వెళ్లబోమని తల్లిదండ్రులు నిరాకరించారు. మంత్రి కేటీఆర్ నిమ్స్‌కు వచ్చి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.