Medaram Bus Accident : మేడారం జాతర ప్రారంభం..వరుసగా ఆర్టీసీ బస్సుల ప్రమాదం

  • Written By:
  • Updated On - February 21, 2024 / 03:54 PM IST

మేడారం (Medaram) మహా జాతర ప్రారంభం వేళ..వరుసగా ఆర్టీసీ బస్సులు (RTC Bus Accidents) ప్రమాదానికి గురి కావడం ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తెలంగాణలో అతి పెద్ద మహా కుంభవేళ గా భావించే మేడారం జాతర రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ ఏడాది ఈరోజు నుండి ఈ మహాజాతర మొదలైంది. నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈజాతరలో ప్రధాన ఘట్టం మొదటి రోజు అనగా బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మతో పాటు, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెపైకి చేరుకుంటారు. సంప్రదాయబద్దంగా ఆదివాసి, గిరిజన పూజారులు ఈ అమ్మవారిని తీసుకొస్తారు.

మూడ్రోజుల పాటు భక్తుల పూజలు అందుకోనున్న దేవతలు తిరిగి శనివారం నాడు కన్నెపల్లి తీసుకువెళ్తారు. ఇక రేపు అనగా ఫిబ్రవరి 22న సమ్మక్కను చిలకలగుట్ట నుంచి గద్దెపైకి తెస్తారు. జాతరలో చివరి రోజైన 24వ తేది నాడు గిరిజన దేవతలు వనప్రవేశం చేస్తారు. దీంతో మేడారం జాతర ముగుస్తుంది. మేడారంలో జరిగే ఈ ఉత్సవాల కోసం తెలంగాణ నుంచే కాకుండా, ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరకు భారీగా భక్తులు వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

భక్తులకు ఎలాంటి అసౌకర్యలు కలగకుండా TSRTC దాదాపు 6500 బస్సులను సిద్ధం చేసింది. అంతే కాకుండా ఆర్టీసీ బస్సులో వెళ్తే అమ్మవార్ల గద్దెల సమీపంలోకి వెళ్లొచ్చు. బస్సుల్లో ప్రయాణించి, సురక్షితంగా వనదేవతలను దర్శించుకోవచ్చు’ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది ర్టీసీ. ఇదే క్రమంలో మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురి కావడం ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈరోజు రెండు చోట్ల రెండు బస్సులు ప్రమాదానికి గురైయ్యాయి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈరోజు ఉదయం.. కాటారం – భూపాలపల్లి రహదారిపై మేడిపల్లి అటవీ ప్రాంతంలో మంచిర్యాల నుంచి మేడారం వెళుతున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. బస్సు నుంచి కొందరు దూకేందుకు ప్రయత్నించారు. గాయాలు కావడంతో… ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు తీవ్రగాయాలు పాలుకాగా, అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ తో పాటు పలువురు ప్రయాణికులకు కూడా గాయలయ్యాయి. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో యాభై మంది వరకూ ప్రయాణికులున్నారు.

ఈ ఘటనే కాదు మేడారం నుంచి ఇల్లెందు వెళ్తున్న బస్సు సైతం అదుపుతప్పి బోల్తా పడిన ఘటన గుండాల మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. మేడారం నుంచి తిరుగు ప్రయాణంలో ఇల్లందు వెళుతున్న ఆర్టీసీ బస్సు బుధవారం ఉదయం గుండాల మండలం మామకన్ను అటవీ ప్రాంతం సమీపంలో అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇలా వరుసగా బస్సులు ప్రమాదానికి గురి అవుతుండడం తో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Minister Gummanur Jayaram : టీడీపీలోకి మంత్రి జయరాం..?