Site icon HashtagU Telugu

Ganesh Idol : చోరీ కేసులో కోర్టుకు వినాయకుడు

Ganesh Idol

Ganesh Idol

Ganesh Idol : గణేష్ చతుర్థి సమీపిస్తున్న తరుణంలో మెదక్ జిల్లాలో విగ్రహ చోరీ ఘటన సంచలనం రేపింది. గత నెల 27న అర్ధరాత్రి సమయంలో కొందరు యువకులు ట్రాలీ ఆటో సాయంతో వినాయకుడి విగ్రహాన్ని దొంగిలించారు. ఈ ఘటన మెదక్ పట్టణంలోని పిల్లికొట్టల్ వద్ద ఉన్న చంద్ర భవన్ కాంప్లెక్స్లో చోటుచేసుకుంది.

చంద్ర భవన్ కాంప్లెక్స్‌లో సురేష్ అనే శిల్పి ప్రతీ ఏడాది గణనాధ విగ్రహాలను తయారు చేసి విక్రయిస్తుంటాడు. ఈసారి కూడా గణేష్ చతుర్థి కోసం విగ్రహాలను సిద్ధం చేస్తుండగా, నలుగురు యువకులు అర్ధరాత్రి వేళ దొంగతనానికి పాల్పడ్డారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు ఈ సంఘటనను బయటపెట్టాయి.

తెల్లవారుజామున షాపు వద్దకు వచ్చిన సురేష్ విగ్రహం కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, మెదక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆధారాల కోసం సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు నిందితుల కదలికలను గుర్తించారు.

Illegal Mining Mafia : రాజానగరంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా

దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. నిందితులు గంజాయి మత్తులో విగ్రహాన్ని ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నలుగురిపై గతంలో కూడా పలు కేసులు నమోదైనట్లు తెలిసింది.

మెదక్ జిల్లా ఏఎస్పీ మహేందర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కేసును పూర్తిగా ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ట్రాలీ ఆటో, దొంగిలించిన వినాయక విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు.

ఈ ఘటనతో పట్టణంలో చర్చనీయాంశం మారింది. గణేష్ చతుర్థి ముందు ఇలాంటి సంఘటన జరగడం ప్రజల్లో ఆందోళన కలిగించింది. మత్తు పదార్థాల ప్రభావం ఎంత ప్రమాదకరమో ఈ కేసు మరోసారి రుజువు చేసింది.

Grey Zone Warfare : గ్రే జోన్ వార్‌ఫేర్‌.. చైనా-పాకిస్తాన్ వ్యూహాలకు భారత్‌ కొత్త సవాళ్లు