Medak Collector Rahul Raj: ఆయనో ఓ జిల్లాకు కలెక్టర్ (Medak Collector Rahul Raj). పాలన సంబంధిత పనులతోనే కాదు జిల్లాలోని ప్రతి అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకుంటూ క్షణం తీరిక లేకుండా ఉంటారు. అయితే ఇంత బిజీలో కూడా కలెక్టర్ ఓ పాఠశాలను సందర్శించి అక్కడి విద్యార్థుల సమస్యల గురించి తెలుసుకున్నారు. పాఠశాల్లోని సమస్యలకు పరిష్కారం కూడా చూపారు. అలాగే పదవ తరగతి విద్యార్థులకు టీచర్‌గా మారిపోయారు. టీచర్‌గా మారటమే కాకుండా మ్యాథ్స్‌లో కష్టమైన త్రికోణమితిని తనదైన శైలిలో చెప్పి విద్యార్థులను ఆశ్చర్యపరిచారు. ఏకంగా కలెక్టరే తమకు పాఠాలు చెప్పడంతో విద్యార్థలు సైతం ఆనందంలో మునిగిపోయారు.
పైన మనం చెప్పుకున్న ఓ వ్యక్తి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఆయన సమయం దొరికినప్పుడల్లా కలెక్టర్ అనే సంగతిని మర్చిపోయి టీచర్‌గా మారుతున్నారు. ఆయనలో ఉన్న నైపుణ్యాన్ని బయటపెడుతూనే ఉంటున్నారు. రాహుల్ రాజ్ ఇప్పుడే కాదు గతంలో కూడా టీచర్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మరోసారి టీచర్ అవతారం ఎత్తారు. శనివారం నాడు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా చేగుంట మండలం వడియారంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో పదవ తరగతి విద్యార్థులకు టీచర్ గా మారి పాఠాలు బోధించి ప్రశ్నలతో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి, అనంతరం భోజనశాలను, స్టోర్ రూమ్‌ను, సైన్స్ ల్యాబ్‌ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలో టీచర్లుగా మారిన ఆయన విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోపాటు వారికి వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలా సన్నద్ధం అవ్వాలో కూడా కలెక్టర్ వారికి టిప్స్ ఇచ్చారు.
Also Read: US President Powers : అమెరికా ప్రెసిడెంట్‌కు ఉండే పవర్స్ గురించి తెలుసా ?
Medak Collector Rahul Raj teaches trigonometry to tenth class students at ZPHS – Nice !!
— Naveena (@TheNaveena) January 19, 2025
కలెక్టర్ రాహుల్ రాజ్ గతంలో కూడా టీచర్‌గా అవతారం ఎత్తారు. మెదక్ జిల్లాలోని శంకరంపేట ఆర్ మండల జిల్లా పరిషత్ పాఠశాలను పరిశీలించారు. అప్పుడు కూడా పదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అయితే కలెక్టర్ ఇలా సమయం దొరికినప్పుడల్లా టీచర్‌గా అవతారం ఎత్తడంతో జిల్లాలోని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కలెక్టర్ లాగే ఇతర అధికారులు కూడా చొరవ తీసుకుంటే బాగుంటుందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.