KCR : కేసీఆర్ అంటే ఆర్భాటం, ఆరంభం, అంతం – రఘునందన్ రావు

తెలంగాణ ప్రయోజనాల కోసం పార్టీ స్థాపించాను అని చెప్పుకునే కేసీఆర్..ఇప్పుడు పార్టీ కనుమరుగై స్థితికి తీసుకొచ్చారన్నారు

  • Written By:
  • Publish Date - April 21, 2024 / 05:54 PM IST

బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఫై..మెదక్ బిజెపి ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు (Medak BJP Candidate Raghunandhan Rao) కీలక విమర్శలు చేశారు. కేసీఆర్ అంటేనే ఆర్భాటం, ఆరంభం, అంతం అని ఎద్దేవా చేశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ కు ఐబై ఏళ్లు… ఇప్పుడేమో 70 ఏళ్లు అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉందని వ్యాఖ్యానించారు. ఆయన రాజకీయం వదిలేసి వ్యవసాయం చేసుకుంటే బాగుంటుందనేది సెటైర్లు వేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పార్టీ స్థాపించాను అని చెప్పుకునే కేసీఆర్..ఇప్పుడు పార్టీ కనుమరుగై స్థితికి తీసుకొచ్చారన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణలో గత పదేళ్లలో ఒక్క మత ఘర్షణ జరగలేదని .. బీజేపీ మతం పేరు మీద రాజకీయం చేస్తుంది అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. దేశంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తుందని వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ.. రాజ్యాంగం మార్చే యోచనలో బీజేపీ లేదని తేల్చి చెప్పారు. వీటిపై కాంగ్రెస్ కావాలనే రెచ్చగొట్టి తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read Also : Koppula: కాంగ్రెస్ ప్రభుత్వంపై కొప్పుల ఫైర్.. హామీల అమలుపై నిలదీత