Site icon HashtagU Telugu

Mecha Nageswara Rao : తన రాజకీయ గురువు తుమ్మలే అంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే

Mechha Thummala

Mechha Thummala

తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao)..ఈ పేరు రాజకీయాల్లో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మలది విశిష్ట స్థానము. రాష్ట్రంలోని ప్రధాన పార్టీని ఒంటిచేత్తో మూడు దశాబ్దాల పాటు ఆయన నడిపించారంటే అర్ధం చేసుకోవాలి తుమ్మల అంటే ఏంటో. టీడీపీ పార్టీ (TDP Party) స్థాపించిన నాటి నుంచి గత ఎన్నికల ముందు వరకు ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. తన అనుచరులను ఎందరినో నాయకులుగా తీర్చిదిద్దారు. టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకొని ఎమ్మెల్యే గా , మంత్రి గా ఎన్నో పదవులు చేపట్టారు. ఈసారి బిఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ తుమ్మల..బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఈ ఎన్నికల్లో ఖమ్మం (Khamamm) నుండి పోటీ చేస్తారా..? పాలేరు (Paaleru) నుండి పోటీ చేస్తారా..? అనేది స్పష్టత రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటె తన రాజకీయ గురువు తుమ్మలే అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు (Mecha Nageswara Rao). 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టీడీపీ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి సమీప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు చేతిలో 930 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీడీపీ పార్టీ పై పోటీ చేసి సమీప TRS పార్టీ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు పై 13,117 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఆ తర్వాత 2021లో BRS ( టిఆర్ఎస్ ) పార్టీలో చేరారు. ప్రస్తుతం మరోసారి బిఆర్ఎస్ నుండి బరిలోకి దిగుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీ గా మెచ్చా..తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. తన రాజకీయ గురువు తుమ్మల అని.. ఆయనతో అనుబంధం మూడు దశాబ్దాలదని ఎమ్మెల్యే తెలిపారు. తుమ్మల పార్టీ మారారని అనుబంధాన్ని తెంచుకోలేనన్నారు. ఎమ్మెల్యేగా అశ్వారావుపేటకు ఎంతో చేశా.. రాబోయే ఎన్నికల్లో గులాబీజెండా ఎగురవేస్తాం అంటూ నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు మూడోసారి కూడా సీఎం కేసీఆర్‌ను గెలిపిస్తారని మెచ్చా నాగేశ్వరరావు జోస్యం చెప్పారు.

అలాగే చంద్రబాబు అరెస్ట్ ఫై కూడా స్పందించారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు ను అరెస్ట్‌ చేయడాన్ని ఖండిచారు. చంద్రబాబు అలాంటి వ్యక్తి కాదని నాగేశ్వరరావు తెలిపారు. నేను చంద్రబాబుకు చెప్పే ప్రజల సేవ కోసం బీఆర్ఎస్‌లో చేరానని, నాపై ఏలాంటి రాజకీయ కుట్ర లేదు.. నా మంచి తనమే తనను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపిస్తుందన్నారు. నేను ఏంటో సీఎంకి, ప్రజలకు తెలుసన్నారు.

Read Also : Bjp Janagarjana Sabha: తెలంగాణ కోసం పోరాడింది కేసీఆర్ ఒక్కడే కాదు