TSRTC : ఆర్టీసీ సిబ్బంది ఫై దాడి చేస్తే..తీవ్ర పరిణామాలు ఎదురుకుంటారు – సజ్జనార్

ఆర్టీసీ సిబ్బంది (TSRTC) ఫై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుందని ఆర్టీసీ ఎండి సజ్జనార్ (MD Sajjanar) హెచ్చరించారు. తాజాగా సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ఘటన లో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై బైక్ డ్రైవర్ దాడి చేసాడు. డ్రైవర్ సీటులోనుండి సదరు డ్రైవర్ ను కిందకు లాగి రోడ్ ఫై ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. ఈ దాడికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. […]

Published By: HashtagU Telugu Desk
Sajjaanar Bus Driver

Sajjaanar Bus Driver

ఆర్టీసీ సిబ్బంది (TSRTC) ఫై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుందని ఆర్టీసీ ఎండి సజ్జనార్ (MD Sajjanar) హెచ్చరించారు. తాజాగా సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ఘటన లో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై బైక్ డ్రైవర్ దాడి చేసాడు. డ్రైవర్ సీటులోనుండి సదరు డ్రైవర్ ను కిందకు లాగి రోడ్ ఫై ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. ఈ దాడికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ప్రస్తుతం పోలీసులు డ్రైవర్ ఫై దాడి చేసిన వ్యక్తుల ఫై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఈ ఘటన ఫై ఎండి సజ్జనార్ స్పందించారు.నిబద్దత, క్రమ శిక్షణతో విధులు నిర్వర్తిస్తోన్న #TSRTC సిబ్బందిపై ఇలా విచక్షణరహితంగా దాడులకు దిగడం సమజసం కాదు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. అయినా చాలా ఓపిక, సహనంతో వారంతా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

సంగారెడ్డి జిల్లా ఆందోల్‌ లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిందీ సంఘటన. బైకర్‌ నిర్లక్ష్యంగా నడపి ప్రమాదానికి కారణమయ్యాడు. అయినా తన తప్పేం లేదన్నట్టు తిరిగి #TSRTC హైర్‌ బస్‌ డ్రైవర్‌పై దాడి చేశారు. దుర్బాషలాడుతూ విచక్షణరహితంగా కొట్టారు.

ఇలాంటి దాడులను యాజమాన్యం అసలే సహించదు. ఈ ఘటనపై అందోల్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆవేశంలో సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బందులకు గురికావొద్దని #TSRTC యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుంది” అని పేర్కొన్నారు.

Read Also : Chandrababu : ఎన్నికల సమయంలో చంద్రబాబుకు భారీ ఊరట..

  Last Updated: 10 Jan 2024, 03:28 PM IST