Site icon HashtagU Telugu

Mayor Gadwal Vijayalakshmi : కాంగ్రెస్ ప్లెక్సీ లలో తన ఫోటో లేదని మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం..

GHMC

GHMC

ప్రస్తుతం తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఫుల్ స్వింగ్ లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించడం..ఆ తరువాత ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ లో చేరడం..ఇంకా చేరుతుండడం తో రోజు రోజుకు తమ బలం పెరుగుతుందని పార్టీ ధీమా గా ఉంది. అయితే పార్టీలో చేరడం వరకు బాగానే ఉంది..కానీ చేరిన నేతలకు..పాతనేతలకు మధ్య విభేదాలు మొదలు అవ్వడం పార్టీ శ్రేణులను ఆందోళలనకు గురిచేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల మంత్రుల మద్యే నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. తాజాగా నగర మేయర్ విజయలక్ష్మి సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రచార ప్లెక్సీ ల ఫై తన ఫోటో వేయడం లేదని ఆమె ఆగ్రహానికి గురయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావిడి నడుస్తుంది. బరిలో నిల్చున్న అభ్యర్థులు తమ తమ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేస్తూ తమ సత్తా చాటుకునేందుకు ట్రై చేస్తున్నారు. ఇక సికింద్రాబాద్ (Secundrabad) స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా.. సికింద్రాబాద్ సెగ్మెంట్ పరిధిలో నిర్వహించనున్న రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ క్రమంలో.. ఆయనకు స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఆ ఫ్లెక్సీకి సంబంధించిన ఫొటోలను.. “సికింద్రాబాద్ పార్లమెంట్” పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపులో షేర్ చేసింది. కాగా ఆ ఫ్లెక్సీలో మేయర్ గద్వాల విజయలక్ష్మి (Mayor Gadwal Vijayalakshmi), డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత ఫొటోలు ప్రింట్ చేయలేదు.

దీనిపై మేయర్ గద్వాల విజయలక్ష్మి.. గ్రూపులోనే తనదైన శైలిలో స్పందించారు. “మీ ప్రోటోకాల్‌లో, ప్రచార ఫ్లెక్సీల్లో ప్రతిసారి మేయర్, డిప్యూటీ మేయర్ ఫోటోలు ఎలా మిస్ అవుతున్నాయి..? మేం వేరే పార్టీలో ఉన్నామా..?” అని విజయలక్ష్మి అదే గ్రూప్‌లో ప్రశ్నించారు. అయితే.. ఆమె పెట్టిన మెస్సేజులను గమనించిన గ్రూప్ అడ్మిన్.. ఫ్లెక్సీ ఫొటోతో పాటు ఆమె పెట్టిన మెస్సేజులను కూడా డిలీజ్ చేశారు. మరి కావాలనే వారి ఫొటోస్ ముద్రించలేదా..? లేక మరచిపోయారా..? అనేది తెలియాల్సి ఉంది. కానీ ఆమె ఘాటుగా రిప్లయ్ ఇచ్చేసరికి అంత రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

Read Also : IPL 2024 RCB vs GT : కోహ్లీ, డుప్లేసిస్ ధనాధన్ ..గుజరాత్ పై బెంగుళూరు విజయం