భద్రాచలం బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు..కాంగ్రెస్ లోకి చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది. భద్రాచలం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి సొంత పార్టీతో తెల్లం వెంకట్రావు అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు..ఇదే సమయంలో రేవంత్ తో పలుమార్లు కలవడం తో వెంకట్రావు కాంగ్రెస్ లోకి వెళ్లడం ఖాయమని రెండు నెలల నుండే అంత భవిస్తూ వస్తున్నారు. అయితే కేవలం నియోజకవర్గ అభివృద్ధి గురించే సీఎం ను కలిసినట్లు వెంకట్రావు చెప్పుకొచ్చారు. కానీ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు(Mla Tellam Venkat Rao) హాజరుకావడం తో ఈయన కాంగ్రెస్ లోకి వెళ్లడం పక్క అని తెలిసిపోయింది.
We’re now on WhatsApp. Click to Join.
లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. అక్కడ జరిగిన మహబూబాబాద్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆ నియోజకవర్గ ఇన్చార్జి ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) హాజరయ్యారు. ఆయన నేతృత్వంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాగా ఈ సమావేశానికి భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సైతం హాజరయ్యారు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ సమావేశంలో ఈయన హాజరుకావడంతో కాంగ్రెస్ లో చేరినట్లే అని అంత భావిస్తున్నారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 6న తుక్కుగూడలో జరిగే సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిఆర్ఎస్ నుండి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరగా..ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ గూటికి వెళ్తే..ఖమ్మం లో ఒక్క బిఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా లేనట్లే..ఎందుకంటే ఖమ్మం పది అసెంబ్లీ స్థానాల్లో 9 స్థానాల్లో కాంగ్రెస్ గెలువగా..ఒక్క భద్రాచలం లో మాత్రమే బిఆర్ఎస్ గెలిచింది..ఇప్పుడు ఆ స్థానం కూడా కాంగ్రెస్ ఖాతాలో పడబోతోంది.
Read Also : Arvind Kejriwal : బరువు తగ్గిన కేజ్రీవాల్.. బ్లడ్ షుగర్‌లో హెచ్చుతగ్గులు.. కాసేపట్లో హైకోర్టులో కీలక విచారణ