Site icon HashtagU Telugu

Hyderabad : ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో భారీ అగ్నిప్రమాదం

Massive Fire Accident at RTC Crossroad

Massive Fire Accident at RTC Crossroad

Fire Accident: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు(RTC Cross Road)లో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. మెట్రో స్టేషన్‌ కింద ఉన్న కమర్షియల్‌ కాంప్లెక్సిలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. వివరాల ప్రకారం.. దత్తసాయి కాంప్లెక్స్‌లో కమర్షియల్‌లో కాసేపటి క్రితం మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి రెండు ఫైర్‌ ఇంజిన్లు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. కాగా, దత్తసాయి కాంప్లెక్స్‌కు తపాడియా ఆసుపత్రి ఆనుకొని ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

అయితే, కాంప్లెక్స్‌ నుంచి మంటలు చెలరేగుతుండటంతో తపాడియా ఆసుపత్రి(Tapadia Hospital) నుంచి రోగులను కిందకు దింపుతున్నారు అధికారులు. మరోవైపు.. ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌వైపు వస్తున్న వాహనాలను ముషీరాబాద్‌లోనే నిలిపిస్తున్నారు. దీంతో, ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

Read Also: Chiranjeevi Viswambhara : విశ్వంభర టీం వాటి పైనే ఫుల్ ఫోకస్..!

కాగా, ప్రమాద స్థలికి చేరుకున్న అధికారులు, పోలీసులు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనేదానిపై విచారణ జరుపుతున్నారు. మరోవైపు.. ఈ అగ్ని ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతం మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలోనే ముషీరాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్‌ వైపు వెళ్లే వాహనాలను మొత్తం ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. ఈ ఘటనతో ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇక ఆ దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఫర్నీచర్ షోరూం ఉండగా.. అందులోకి కూడా మంటలు వ్యాపించడంతో.. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతం మొత్తం మంటలు, దట్టమైన పొగతో అలుముకుంది.

Read Also: Indian 2 : హైప్ లేని సినిమాకి టికెట్ ధర పెంపు అవసరమా..!