Encounter : ములుగులో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి

  • Written By:
  • Publish Date - April 6, 2024 / 12:02 PM IST

Encounter: తెలంగాణ-చత్తీస్‌గఢ్(Telangana-Chhattisgarh) సరిహద్దులో పోలీసులు(police), మావోయిస్టుల(Maoists)కు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో(crossfire) ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఎదురుపడడంతో తప్పించుకునే ప్రయత్నంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు.
We’re now on WhatsApp. Click to Join.

కాల్పులు ఆగిన తర్వాత పోలీసులు ఆ ప్రాంతంలో గాలించగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఏకే 47తోపాటు మూడు తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికల వేళ మావోయిస్టు ప్రబావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందుకే అనుమానిత ప్రాంతల్లో తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి.

Read Also: Sreemukhi: బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీముఖి.. ఆ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్?

ఈ మధ్య కాలంలో తెలంగాణ సరిహద్దుల్లో నిఘా పెరిగింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు, ఆ రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే పోయే వారిపై ప్రత్యేక నజర్ పెట్టారు. దీంతో తరచూ కాల్పుల ఘటనలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు మావోయిస్టులు ప్లాన్ చేశారన్న అనుమానంతో తనిఖీలు సాగుతున్నాయి. రిక్రూట్‌మెంట్‌లు కూడా భారీగా జరుగుతున్నాయన్న సందేహాలు పోలీసుల్లో ఉన్నాయి.

Read Also: YS Sunitha Reddy : అవినాశ్‌ను ఓడించేందుకే పాలిటిక్స్‌లోకి వస్తున్నా : వైఎస్ సునీత

కాగా, గత సోమవారం చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.