Site icon HashtagU Telugu

Marri Shashidhar Reddy: బీజేపీకి ఆ సత్తా ఉంది.. అందుకే చేరుతున్నా..! (Video)

Marri

Marri

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి.. కాషాయంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 25 లేదా 26 వ తేదీన ఢిల్లీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందన్నారు.

అందుకే తాను ఆ పార్టీలోకి వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు పార్టీని భ్రష్టు పట్టించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం సనత్ నగర్ లోని తన కార్యాలయంలో తన అనుచరులు, నియోజకవర్గ కాంగ్రెస్ నేతలతో సమావేశం అనంతరం శశిధర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

 

 

శశిధర్ రెడ్డి వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు ధీటుగా సమాధానం ఇస్తున్నారు. ఎన్నికల్లో గెలవలేని ఇలాంటి నేతలు ఉంటే ఎంత పోతే ఎంత. కాంగ్రెస్ పైనా రేవంత్ రెడ్డి పైనా విమర్శలు చేసే నైతిక హక్కు ఆయనకు లేదని మండిపడుతున్నారు.

Exit mobile version