Site icon HashtagU Telugu

Malkajgiri : మల్కాజ్‌గిరి లో మర్రి రాజశేఖర్ రెడ్డి భారీ ర్యాలీ..టికెట్ ఖరారైనట్లే..?

marri rajasekhar reddy ryali in malkajgiri

marri rajasekhar reddy ryali in malkajgiri

మల్కాజ్‌గిరి (Malkajgiri) నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి (Marri Rajasekhar Reddy)నా..అంటే అవుననే అంటున్నాయి బిఆర్ఎస్ వర్గాలు. తెలంగాణలో డిసెంబర్ 07 న అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Election 2023) జరగబోతున్నట్లు సమాచారం అందుతుంది. ఈ తరుణంలో అన్ని పార్టీ లు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఇదే క్రమంలో అన్ని పార్టీలలో వలసలు మొదలయ్యాయి. అయితే అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) కు మాత్రం వరుస షాకులు ఎదురవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటించారు గులాబీ బాస్.

గతంలో మాదిరిగానే చాలావరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కేటాయించడంతో టికెట్ కోసం ఆశపడిన వారు నిరాశకు లోనయ్యారు. ఇంతకాలం టికెట్ ఇస్తారనే ఆశతో పార్టీ కోసం పనిచేసినవారిని పట్టించుకోరా అంటూ కొంతమంది బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ (Congress) లో చేరుతున్నారు. తాజాగా మల్కాజ్ గిరి (Malkajgiri) బిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతురావు (Mynampally Hanumantha Rao) పార్టీ కి రాజీనామా చేసారు. దీనికి కారణం తన కొడుక్కు మెదక్ టికెట్ ఇవ్వలేదని..అదే కారణం తో ఆయన బిఆర్ఎస్ కు రాజీనామా చేసారు. మైనంపల్లి రాజీనామా చేయడం తో..ఆస్థానంలో ఎవర్ని బరిలో dinpalani కసరత్తులు చేసిన బిఆర్ఎస్ అధిష్టానం..ఫైనల్ గా మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ని ఖరారు చేసినట్లు తెలుస్తుంది.

అందుకే మల్కాజిగిరి నియోజకవర్గంలో ఈరోజు బీఆర్ఎస్ నాయకులతో మర్రి రాజశేఖర్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. అటు ఆనంద్ బాగ్ నుండి మల్కాజిగిరి వరకు సాగనున్న ర్యాలీలో మంత్రి మల్లారెడ్డి పాల్గొనున్నారు. ఇలా ఇద్దరు మామ అల్లుడు భారీ ర్యాలీ చేపట్టి ప్రచారం మొదలుపెట్టబోతున్నారు.

Read Also : Telangana : బిజెపికి భారీ షాక్..కాంగ్రెస్ లోకి ఆ ఐదుగురు..?