Margadarsi : మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థపై చాలాకాలంగా కొనసాగుతున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్‌కు తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, సంస్థపై నడుస్తున్న క్రిమినల్ కేసును రద్దు చేస్తూ సోమవారం కీలక తీర్పు వెలువరించింది.
2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారన్న ఆరోపణలపై మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఈ కేసును 2018లోనే హైకోర్టు రద్దు చేసింది. అయితే, ఫిర్యాదుదారు ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Dengue Fever : డెంగీ జ్వరం తగ్గిందని ఊపిరిపీల్చుకుంటున్నారా? అసలు కథ ముందుంది..ఇది చూడండి!
2024 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌లను తిరిగి హైకోర్టుకే పంపించింది. వాస్తవ పెట్టుబడిదారులు, డిపాజిటర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, కేసును కొనసాగించాలా లేదా అనేది తేల్చాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2024 సెప్టెంబర్ 26న హైకోర్టు రిజిస్ట్రీ పత్రికల్లో పబ్లిక్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసులో డిపాజిటర్లకు తమ అభ్యంతరాలను తెలియజేయమని ఆహ్వానం పలికింది. అయితే, సంస్థ ఇప్పటికే డిపాజిటర్లందరికీ సొమ్ము చెల్లించడంతో ఒక్క క్లెయిమ్ కూడా రాలేదు.
ఈ ఏడాది జనవరిలోనే మార్గదర్శి సంస్థ కోర్టుకు కీలక వివరాలను సమర్పించింది. డిపాజిటర్లందరికీ డబ్బులు తిరిగి చెల్లించామని, అలాగే కేసులో హిందూ అవిభాజ్య కుటుంబ (HUF) మాజీ కర్త మరణించడంతో మిగిలిన సభ్యులను నిందితులుగా చేర్చడం సాధ్యం కాదని సంస్థ స్పష్టం చేసింది.
ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఇకపై ఈ కేసును కొనసాగించాల్సిన అవసరం లేదని తేల్చింది. డిపాజిటర్ల నుంచి ఒక్క అభ్యంతరం కూడా రాకపోవడం, డబ్బులు మొత్తం చెల్లించబడటం, HUF మాజీ కర్త మరణం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేస్తూ తుది తీర్పు వెలువరించింది.
Sinusitis : సైనసైటిస్‌తో సమస్య తీవ్రంగా వేధిస్తుందా? ఇలాంటి తప్పులు అస్సలు చేయొద్దు