Site icon HashtagU Telugu

Maoists: రామగుండం ఎమ్మెల్యేకు మావోయిస్టుల వార్నింగ్‌

maoists naxals

maoists naxals

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రామగుండం ఫర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ (RFCL)లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ యువత నుంచి వసూలు చేసిన ₹45 కోట్లు తిరిగి చెల్లించాలని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ పటేల్‌ను మావోయిస్టులు హెచ్చరించారు. నిషేధిత మావోయిస్టు గ్రూపు భూపాలపల్లి-మహబూబాబాద్-వరంగల్-పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ విడుదల చేసిన లేఖలో కంపెనీ కాంట్రాక్టర్లు కాకుండా ఎమ్మెల్యే బంధువులు, అనుచరుల పేర్లను ప్రస్తావించారు. RFCLలో నియామకం కోసం ఒక్కొక్కరు ₹4 లక్షల నుండి ₹7 లక్షలు వ‌సూలు చేసిన‌ట్టు స‌మాచారం.

గుజరాత్‌కు చెందిన కంపెనీ కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత, ఈ యువత ఒక్కొక్కరుగా తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఉద్యోగం కోల్పోయిన వారు తమ డబ్బు తిరిగి ఇవ్వాలని చందర్ పటేల్‌ను సంప్రదించినప్పుడు, అతను వారిని బెదిరించడం ప్రారంభించాడు. యువకులపై తప్పుడు కేసులు పెట్టాడు అని మావోయిస్టు నాయకుడు పేర్కొన్నాడు. నిరుద్యోగులకు ఎమ్మెల్యే తిరిగి చెల్లించాలని, లేని పక్షంలో తాను, అతని బంధువులు, అనుచరులు తగు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని డిమాండ్‌ చేశారు. కాగా రామగుండం ఎమ్మెల్యేపై ప్రతిపక్ష పార్టీలు, కొన్ని ప్రజా సంఘాలు కూడా ఇలాంటి ఆరోపణలు చేశాయి.

Exit mobile version