Site icon HashtagU Telugu

Maoist Party : బిఆర్ఎస్ పార్టీని తన్ని తరిమేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు

Maoist Party Brs

Maoist Party Brs

ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన బిఆర్ఎస్ (BRS) పార్టీని తన్ని తరిమేయాలని మావోయిస్టు పార్టీ (Maoist Party) పిలుపునిచ్చింది. తెలంగాణ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ తో పాటు మిగతా పార్టీలన్నీ కూడా తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఎవరికీ వారు వారి వారి మేనిఫెస్టో లతో ఓటర్లను ఆకట్టుకునేపనిలో పడ్డాయి. రెండుసార్లు అధికారం చేపట్టిన బిఆర్ఎస్…మరోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంటే..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి..అసలైన తెలంగాణ ను మీము తీసుకొస్తామని కాంగ్రెస్..కేంద్రంలో ఉన్న పార్టీనే రాష్ట్రంలో కూడా ఉంటె ఇంకా అభివృద్ధి జరుగుతుందని బిజెపి..ఇలా ఎవరికీ వారు మీము రావాలంటే మీము రావాలంటూ ప్రచారం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ తరుణంలో మావోయిస్టు పార్టీ బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పిలుపునిచ్చింది. దొరల కుటుంబ పాలన సాగిస్తూ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను కొద్దిమంది దోపిడీదారులు మాత్రమే అనుభవిస్తున్నారని, ప్రజలు కోరుకున్న పాలన ఇది కాదని, ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడాల్సిన అనివార్యత ఏర్పడిందని ఆ పార్టీ వ్యాఖ్యానించింది. రాష్ట్రం ఏర్పడితే నియామకాలు దక్కుతాయని వీరోచితంగా పోరాడారని, ఉద్యమకారులు ప్రాణత్యాగం చేశారని, కానీ రెగ్యులర్ ఉద్యోగాల్లేక ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, నిరుద్యోగులు నిత్యం పోరాడక తప్పని పరిస్థితులే ఉన్నాయన్నారు. నిరుద్యోగులకు ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకపోగా ఉద్దేశపూర్వకంగానే గ్రూప్-1 పరీక్షలను అనేకసార్లు రద్దు చేయించిందన్నారు. ఎన్నికలు రాగానే రైతుబంధు, దళితబంధు, బీసీ బంధు, గిరిజనబంధు అంటూ ప్రజలను బీఆర్ఎస్ మాయచేస్తున్నదని, గతంలో ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయలేదని మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శ జగన్ అన్నారు.

దళితులకు మూడెకరాల భూమి వాగ్ధానాన్ని గద్దెనెక్కిన తర్వాత మరచిందన్నారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటూనే వారి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించలేదని, కౌలు రైతులను పట్టించుకోనే లేదని, కూలీల సమస్యలనూ గాలికొదిలేసిందన్నారు. కాళేశ్వరం ద్వారా కేసీఆర్ ఫ్యామిలీ కోట్లాది రూపాయల డబ్బును పోగేసుకున్నదని, రాష్ట్రాన్ని మాత్రం అప్పుల్లోకి నెట్టిందని ఆరోపించారు. ఇప్పుడు ఆ అప్పుల మీద వడ్డీలు చెల్లించడానికి ప్రభుత్వ భూముల్ని అమ్ముకోవాల్సిన దుస్థితి పట్టిందని గుర్తుచేశారు. ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీతో బీఆర్ఎస్‌కు అంతర్గత ఐక్యత ఉన్నదని ఆరోపించారు. బీజేపీతో అంటకాగుతున్న అవకాశవాద బీఆర్ఎస్‌ను తన్ని తరిమేయాలని ప్రజలకు జగన్ పిలుపునిచ్చారు.

Read Also : Vijayashanti: బీజేపీ, బీఆర్ఎస్‌ రెండూ పార్టీలు ఒక్కటే: విజయశాంతి