Site icon HashtagU Telugu

BRS Leaders: బీఆర్ఎస్ లీడర్స్ కు మావోయిస్టుల వార్నింగ్, కలకలం రేపుతున్న పోస్టర్స్

maoists naxals

maoists naxals

BRS Leaders: ఎన్నికల వేళ మావోల కదలికలు అధికార పార్టీ నాయకుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే భూపాలపల్లి, ఆదిలాబాద్ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్టు సమాచారం. పోలీసుల కఠిన బందోబస్తు నిర్వహిస్తున్నా.. తమ కదలికలతో ప్రభావం చూపుతూనే ఉన్నారు. తాజాగా మావోయిస్టులు బిఆర్‌ఎస్‌ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు.

సిద్ధిపేటలో మావోయిస్టు పార్టీ పేరుతో ప్రదర్శించిన పోస్టర్లు అధికారుల్లో కలకలం రేపుతున్నాయి. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక-దుంపలపల్లి మధ్య ఉన్న పిల్లర్‌కు సిపిఐ మావోయిస్టు పార్టీ పేరుతో పోస్టర్లను అతికించారు. ఈ పోస్టర్ల ద్వారా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా బిఆర్‌ఎస్‌ నాయకులకి హెచ్చరికలు జారీ చేశారు.

బిఆర్‌ఎస్‌ నాయకులు ఇసుక మాఫీయా, భూ కబ్జాలు చేస్తున్నారని.. ప్రశ్నించినవారిపైన దాడులు చేసి హత్యలు చేస్తున్నారని.. ప్రజల పై బిఆర్‌ఎస్‌ నాయకులు పెత్తనం చెలయిస్తున్నారని. ఇదే కొనసాగితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని.. ఈ అక్రమాలను తక్షణమే ఆపేయాలని.. లేకపోతే ప్రజల ముందు శిక్షలు తప్పవు అంటూ మావోయిస్టులు పోస్టర్ల ద్వారా బిఆర్‌ఎస్‌ నాయకులకు హెచ్చరికలు జారీచేశారు. అయితే ఈ పోస్టర్లు ఎవరు అంటించారు అనేది ప్రశ్నగా మిగిలింది. అయితే పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఛత్తీస్ గఢ్ లో కూంబింగ్ నిర్వహించి పోలీసులు ముగ్గురు మావోయిలను ఎన్ కౌంటర్ చేశారు.

Also Read: Hyderabad: షాకింగ్.. పోలీసుల పేరుతో 18.5 లక్షలు దోచేశారు!