Manchu manoj : మరోసారి వీధికెక్కిన మోహన్ బాబు కుటుంబ విభేదాలు

బుధవారం ఉదయం జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మనోజ్‌ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు తెరవకపోవడంతో ఆయన బయటే బైఠాయించారు. ఈక్రమంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు.

Published By: HashtagU Telugu Desk
Manoj sit-in at Mohan Babu house.. Police deployed in heavy numbers

Manoj sit-in at Mohan Babu house.. Police deployed in heavy numbers

Manchu manoj : గత కొంతకాలంగా నటుడు మోహన్‌బాబు కుటుంబంలో వివాదాలు జరుగుతోన్న విషయం తెలిసిందే. మంచు కుటుంబ రచ్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు మరోసారి మంచు కుటుంబంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బుధవారం ఉదయం జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మనోజ్‌ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు తెరవకపోవడంతో ఆయన బయటే బైఠాయించారు. ఈక్రమంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మనోజ్ అక్కడకు వస్తున్నాడనే సమాచారంతో అప్పటికే అక్కడ పోలీసులు మోహరించారు.

కాగా, ఈ నెల 1న మా పాప పుట్టినరోజు సందర్భంగా జయపుర వెళ్లగా నా సోదరుడు విష్ణు 150 మందితో జల్‌పల్లిలోని ఇంట్లోకి ప్రవేశించి వస్తువులు, సామగ్రి ధ్వంసం చేశారు. మా కార్లను టోయింగ్‌ వాహనంతో ఎత్తుకెళ్లి రోడ్డు మీద వదిలేశారు. నా కారును దొంగిలించి విష్ణు ఇంట్లో పార్క్‌ చేశారు. జల్‌పల్లిలో నా భద్రతా సిబ్బందిపై దాడి చేశారు. కారు చోరీపై నార్సింగి పోలీసులకు సమాచారం ఇవ్వగా అది విష్ణు ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. రికవరీకి వెళ్లినప్పుడు దాన్ని మాదాపూర్‌కు పంపించారు అని మనోజ్‌ మీడియాతో చెప్పారు. ఇక, తన కారు పోయిందని మంగళవారం మనోజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈరోజు మోహన్ బాబు ఇంటికి మనోజ్ వెళ్లాడు.

Read Also: Alekhya Chitti Pickles : దెబ్బకు హాస్పటల్ పాలైన ‘అలేఖ్య చిట్టి పికిల్స్’

 

  Last Updated: 09 Apr 2025, 12:37 PM IST