తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి రావడం తో ఇతర రంగాల వేత్తలు..కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. ఎన్నికల ముందు వరకు పెద్ద ఎత్తున ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా..ఇక ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ లో కీలక పదవుల్లో ఉన్న వారు మెల్లగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇప్పటీకే పలువురు జడ్పీటీసీ , ఎంపీటీసీ లు చేరగా..తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త జీవన్ రెడ్డి (Manne Jeevan Reddy) కాంగ్రెస్ లో చేరేందుకు చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి సోదరుని కుమారుడు మన్నే జీవన్ రెడ్డి ఫ్యామిలీ సభ్యులు 2018 లో బీఆర్ఎస్(BRS)లో చేరారు. ఎంఎస్ఎన్ రెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ (KCR)తో ఉన్న సంబంధాల కారణంగా జీవన్ రెడ్డితో సహా, ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి తదితరులు బీఆర్ఎస్‌లో చేరారు. మన్నే శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపిక పోటీ చేసి గెలుపొందారు.
జడ్చర్ల, మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏదైనా ఒక దాని నుండి పోటీ చేయాలని జీవన్ రెడ్డి మొదటి నుండి ఆశిస్తూ వచ్చారు. సిట్టింగ్‌లకే బీఆర్ఎస్ టికెట్లు రావడంతో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఈయన కాంగ్రెస్ లో చేరితే ఎంపీ టికెట్ ఇస్తారో లేదో చూడాలి.
Read Also : AP : జగన్ తోనే ఉండి చావో.. రేవో తేల్చుకుంటా – ఎంపీ గోరంట్ల