Site icon HashtagU Telugu

Mandula Samuel : కౌశిక్ కు మతిభ్రమించింది – ఎమ్మెల్యే మందుల శామ్యూల్

Padi Kaushik Reddy Mandula

Padi Kaushik Reddy Mandula

Mandula Samuel Fire on Padi Kaushik Reddy : గత వారం రోజులుగా తెలంగాణ లో పాడి కౌశిక్ రెడ్డి vs కాంగ్రెస్ (Paadi Koushik Vs Congress )వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కాస్త చల్లారింది అనుకునేలోపే ..మళ్లీ పలు వ్యాఖ్యలు చేసి వేడిపెంచుతున్నాడు కౌశిక్ రెడ్డి. మొన్నటికి మొన్న బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల ఫై పలు వ్యాఖ్యలు చేసి నానా రచ్చ చేసాడు. ఇది తగ్గిందనుకునేలోపే..సీఎం రేవంత్ ఫై సంచలన వ్యాఖ్యలు చేసాడు. తాను కాంగ్రెస్లో ఉన్నప్పుడు TPCC చీఫ్ అయ్యేందుకు రేవంత్ మద్దతు కోరుతూ కాళ్లు మొక్కారని కౌశిక్ చెప్పుకొచ్చారు. అంతే కాదు రేవంత్‌ను కుర్చీ దింపే వరకూ తాను కాంప్రమైజ్ కానని తేల్చి చెప్పారు. అంతరకూ నిద్రపోకుండా పనిచేస్తానని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే మందుల శామ్యూల్ (Mandula samuel)..పాడి కౌశిక్ కు హెచ్చరిక జారీచేశారు.

పీసీసీ పదవి ఇప్పించాలని రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన వద్దకు వచ్చారని కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మందుల శామ్యూల్ మండిపడ్డారు. కౌశిక్ కు మతిభ్రమించిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణలను వెనక్కుతీసుకోవాలని లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు తరిమి కొట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించింది కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలేనని, బీజేపీకి ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మంత్రి వర్గ ఉప సంఘం వేయడం హర్షించదగ్గ విషయమని, త్వరలో వర్గీకరణ జరుగుతుందని శామ్యూల్ ధీమా వ్యక్తం చేశారు.

ఇటు ప‌త్రి గ్రామానికీ ఇంట‌ర్‌నెట్ సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య ప‌న్నుల శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు అన్నారు. ప్ర‌జాపాల‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ..ఫైబర్ నెట్వర్క్ 8000 గ్రామాలకు నెట్వర్క్ అందించామని మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు అన్నారు. మరో 3000 గ్రామాలకు నెట్ వర్క్ చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో మూడు గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని నెట్వర్క్ సదుపాయం కల్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.

Read Also : Suspicious Bag : సీఎం రేవంత్ ఇంటి సమీపంలో బాంబు కలకలం..కాకపోతే..!!