Lok Sabha Elections : RS ప్రవీణ్ కుమార్‌కు భారీ షాక్ తగలబోతుందా..?

నిన్నటి వరకు నాగర్ కర్నూల్ లో తనదే విజయం అని ధీమా గా ఉన్నారు. ఎందుకంటే ఇటు bsp శ్రేణులతో పాటు అటు బిఆర్ఎస్ శ్రేణులు తనకు మద్దతు ఇస్తారని..తనకే ఓటు వేస్తారని..దీంతో విజయం తనదే అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు భారీ షాక్ తగిలింది.

Published By: HashtagU Telugu Desk
Rs Praveen Revanth

Rs Praveen Revanth

తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) పర్వం కాకరేపుతుంది. ఈసారి గెలుపు మాదంటే మాదే అంటూ అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా బిఆర్ఎస్ (BRS) పార్టీకి ఈ ఎన్నికలు చాల కీలకంగా మారాయి. అందుకే అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులేస్తూ వచ్చింది. పార్టీని చాలామంది వీడడంతో ఇతర పార్టీల నుండి నేతలను ఆహ్వానించి వారిని బరిలోకి దింపింది. అలాంటి వారిలో RS ప్రవీణ్ (R. S. Praveen Kumar) ఒకరు. BSP నుండి బయటకు వచ్చి..బిఆర్ఎస్ లో చేరి నాగర్ కర్నూల్ నుండి బిఆర్ఎస్ తరుపున ఎంపీ అభ్యర్థి బరిలో నిల్చున్నారు. నిన్నటి వరకు నాగర్ కర్నూల్ లో తనదే విజయం అని ధీమా గా ఉన్నారు. ఎందుకంటే ఇటు bsp శ్రేణులతో పాటు అటు బిఆర్ఎస్ శ్రేణులు తనకు మద్దతు ఇస్తారని..తనకే ఓటు వేస్తారని..దీంతో విజయం తనదే అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు భారీ షాక్ తగిలింది.

We’re now on WhatsApp. Click to Join.

నాగర్ కర్నూల్ కాంగ్రెస్ టికెట్ ఆశించిన మంద జగన్నాధం (Manda Jagannath) కు ఆ పార్టీ షాక్ ఇచ్చింది. ఆయనకు కాకుండా మల్లు రవికి టికెట్ కేటాయించడంతో అసంతృప్తిగా ఉన్న జగన్నాథం బీఎస్పీలో చేరాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే ఆయన మాయవతిని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లేందుకు చూస్తున్నాడు. అంతే కాదు బీఎస్‌పీ నుంచి నాగర్‌కర్నూల్ ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు కూడా. ఈ ప్రకటన తెలిపిన దగ్గరి నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లో ఖంగారు మొదలైంది. ఎందుకంటే ఒకవేళ జగన్నాథం bsp నుండి పోటీ చేస్తే ఖచ్చితంగా ప్రవీణ్ కు దెబ్బ అని అంటున్నారు. ఇక్కడ ప్రవీణ్ కంటే జగన్నాధానికే ఎక్కువగా బలం ఉంది. దీంతో ప్రవీణ్ ఖంగారు పడుతున్నారని తెలుస్తుంది. కాగా, గతంలో నాలుగు సార్లు ఎంపీగా గెలిచి జగన్నాథం రికార్డు సృష్టించారు. దీంతో ఆయనకే ఎక్కువ సపోర్ట్ ఉంటుందని అంత భావిస్తున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.

Read Also : KCR: దూకుడు పెంచిన కేసీఆర్.. త్వరలో బస్సుయాత్ర.. ఎంపీ అభ్యర్థులకు భీపారాలు!

  Last Updated: 16 Apr 2024, 04:47 PM IST