తెలుగు సినిమా సెలబ్రిటీలకు బెట్టింగ్ యాప్స్ (Betting App )ప్రమోషన్ వ్యవహారం చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్(Betting App Case) పై కఠిన చర్యలు తీసుకునేందుకు సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ఈ యాప్స్‌ను ప్రమోట్ చేసే సినీ తారలపై పోలీసులు నిఘా పెట్టి, ఇప్పటికే 11 మంది సెలబ్రిటీలకు కేసులు నమోదు చేశారు. తాజాగా ఈ వివాదంలో మంచు లక్ష్మీ (Manchu Lakshmi ) పేరు తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది.
WhatsApp Governance : జూన్ 30 నాటికి వాట్సాప్ ద్వారా 500 రకాల పౌరసేవలు: మంత్రి లోకేశ్
సోషల్ మీడియాలో మంచు లక్ష్మీ బెట్టింగ్ యాప్ యోలో 247 ను ప్రమోట్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆమె ఈ యాప్ ద్వారా డబ్బు సంపాదనకి ఇది మంచి అవకాశం అని చెప్పినట్లు ఉంది. ఇప్పటికే ఇతర సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసిన నేపథ్యంలో మంచు లక్ష్మీపై కూడా కేసు నమోదు అవుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ పోలీసులు ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రచారంలో ఉన్న హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్, యాంకర్ శ్యామల సహా పలువురిపై కేసులు నమోదు చేశారు. ఇప్పుడు మంచు లక్ష్మీ పేరు రావడంతో ఆమెపై పోలీసులు చర్యలు తీసుకుంటారా? అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.