Site icon HashtagU Telugu

Hyderabad: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్‌కు నోటీసులు

Revanth And Balka Suman

Revanth And Balka Suman

Hyderabad: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు మంచిర్యాల పోలీసులు నోటీసులు జారీ చేశారు .దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాల్క సుమన్‌కు నోటీసులిచ్చి విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు.

ముఖ్యమంత్రి రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిపై 294జీ, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిజానికి గత కొన్ని రోజులుగా బాల్క సుమన్‌కు నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలో నేపాల్ పారిపోయాడన్న వార్తలు వైరల్ అయ్యాయి. ఆదివారం పోలీసులు ఫోన్ చేయగా.. తాను హైదరాబాద్‌లో ఉన్నానని, అందుబాటులో ఉంటే నోటీసులు తీసుకుంటానని చెప్పాడు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌లో బాల్క సుమన్‌కు మంచిర్యాల పోలీసులు నోటీసులు అందించారు.

Also Read: Acharya Pramod Krishnam: 6 ఏళ్లు కాదు 14 ఏళ్ళు బహిష్కరించండి.. ఎందుకంటే రాముడు కూడా…!