Site icon HashtagU Telugu

Mancherial : మంచిర్యాల బీఆర్ఎస్‌లో నిరసన.. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని మార్చాలి..

Mancherial EX MLA Gaddam Aravind Reddy fires on Mla Divakar Rao

Mancherial EX MLA Gaddam Aravind Reddy fires on Mla Divakar Rao

త్వరలో తెలంగాణ(Telangana) ఎలక్షన్స్(Elections) ఉన్న నేపథ్యంలో ఇటీవల బీఆర్ఎస్‌(BRS) దాదాపు అన్ని చోట్ల ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ని ప్రకటించింది. కొన్ని చోట్ల తప్ప 90 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మార్చిన ప్రదేశాలతో పాటు మరి కొన్ని చోట్ల కూడా బీఆర్ఎస్‌ కు నిరసన ఎదురవుతుంది. కొన్ని చోట్ల పార్టీలో అసమ్మతి గళం వినిపిస్తుంది. ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మార్చాలని కొంతమంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి(EX MLA Gaddam Aravind Reddy) నివాసంలో తెలంగాణ ఉద్యమకారులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం చేసిన నేతలకు గుర్తింపు లేదు. సీఎం కేసీఆర్ మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్ లో సర్వేల్లో తక్కువ శాతం వచ్చిన అభ్యర్థికి టికెట్ ఇవ్వడం సరికాదు. రెండు పర్యాయాలు కేసీఆర్ సూచన మేరకు మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్ లో పోటీ చేయలేదు. మంచిర్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావుకు పరిపాలనపై పట్టింపు లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చినా మంచిర్యాల నియోజకవర్గం ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. వెలమ సామాజిక వర్గానికే మూడు ప్రధాన పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి. నన్ను లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎన్నికల్లో గెలిపించుకుంటాం అని ప్రజలు చెప్తున్నారు. త్వరలో బీఆర్ఎస్‌ అధిష్టానాన్ని, అగ్రనేతలను కలుస్తాను. మంచిర్యాల బీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్థిని మార్చాలని విజ్ఞప్తి చేస్తాను అని తెలిపారు. మరి దీనిపై మంచిర్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావు, పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తారో చూడాలి.

 

Also Read : Amit Shah : వాటన్నింటికీ కాలం చెల్లింది.. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే.. ఖమ్మంలో అమిత్ షా