Site icon HashtagU Telugu

Mancherial Constituency : మంచిర్యాల క్యాండిడేట్ ని మార్చాలి.. లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారు..

Mancherial Constituency issue ex MLAs demands to change BRS Candidate

Mancherial Constituency issue ex MLAs demands to change BRS Candidate

ఎలక్షన్స్(Elections) కి కొన్ని నెలలు ఉండగానే బీఆర్ఎస్(BRS) పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించిన దగ్గర్నుంచి బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు ఎక్కువయ్యాయి. కొంతమంది సీట్ రాలేదని గొడవ చేస్తుంటే, కొంతమంది అభ్యర్థిని మార్చాలని గొడవ చేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలలో ఈ గోల ఉండగా తాజాగా ఇందులో మంచిర్యాల(Mancherial Constituency) కూడా చేరింది.

తాజాగా మంచిర్యాల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యేలు అరవింద్ రెడ్డి(Gaddam Arvind Reddy), గోనే ప్రకాష్ రావు(Gone Prakash Rao) ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో అరవింద్ రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ ని కలిసి మంచిర్యాల టిక్కెట్ ను బీసీలకు కేటాయించాలని కోరాం. కేటీఆర్ నా ప్రపోజల్ కి సానుకూలంగా స్పందించారు. నా ప్రపోజల్ ని బీఆర్ఎస్ ఒప్పుకోకపోతే బీసీ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాను. కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనుకుంటున్న ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యేగా గెలిస్తే అరాచకాలు ఎక్కువ అవుతాయి. గతంలో ఎమ్మెల్సీ గా ప్రేమ్ సాగర్ రావ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను చాలా ఇబ్బందుల కు గురి చేశాడు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మార్చకపోతే కాంగ్రెస్ వాళ్ళే గెలుస్తారు. అప్పుడు మనకు ఇబ్బందులు తప్పవు అని అన్నారు.

ఇక గొనె ప్రకాష్ రావ్ మాట్లాడుతూ.. మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్ లో బీసీలకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే మూడు కోట్ల రూపాయల విలువైన తన 30 గంటల భూమిని విరాళంగా అందిస్తాను. బిసి జనాభా ప్రాతిపదికన మంచిర్యాల టిక్కెట్ ను అన్ని పార్టీలు బీసీ అభ్యర్థులకే కేటాయించాలి అని అన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం మంచిర్యాల అభ్యర్థిగా ఇప్పుడు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావు నే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read : KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు