Site icon HashtagU Telugu

Manakondur MLA : వైరల్ గా మారిన మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే చిలిపి పని వీడియో

Manakondur Mla Kavvampally

Manakondur Mla Kavvampally

తెలంగాణ లో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..ప్రజల మెప్పు పొందుతుంది. సీఎం గా భాద్యతలు చేపట్టిన రేవంత్ (CM Revanth) తన మార్క్ పాలన కొనసాగిస్తున్నారు. పదేళ్ల తర్వాత అధికారం చేపట్టడం తో పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో న్యూ ఇయర్ వేడుకలను సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. అయితే మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన పని..ఇప్పుడు యావత్ కాంగ్రెస్ పార్టీ ని విమర్శల పలు చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (Manakondur MLA Kavvampally Satyanarayana)కు సంబంధించిన ఓ వీడియో.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ (New Year Celebrations)లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో.. కేక్‌ కట్ చేసిన తర్వాత ఎమ్మెల్యే కవ్వంపల్లి.. ఓ మహిళ పట్ల వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదంగా మారింది. కొత్త ఏడాది వేడుకల్లో భాగంగా.. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి.. ఎమ్మెల్యే కవ్వంపల్లి కేక్‌ కట్టింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేక్‌ కట్టింగ్ తర్వాత పక్కనే ఉన్న ఓ మహిళకు కేక్‌ పూసేందుకు ఎమ్మెల్యే ప్రయ‌త్నించారు. ఆ మహిళ ఇబ్బంది పడుతున్నా.. ఎమ్మెల్యే వెనక్కి తగ్గినట్లు కనిపించలేదు. ఐతే ఈ ఘటన జరుగుతున్నప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ పక్కనే ఉన్నారు. ఇక మరో వీడియోలో తాను డ్యాన్సు చేస్తూ.. ఆ మహిళను కూడా డ్యాన్స్ చేయాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి ఒత్తిడి చేయడం కనిపించింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Telangana : మహిళలకు TSRTC షాక్..?