Ramagundam Fertilizers : ‘రామగుండం ఫెర్టిలైజర్స్’.. ఇది నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాల జాయింట్ వెంచర్ కంపెనీ. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్న రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కంపెనీ జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 7 కేటగిరీలకు చెందిన మొత్తం 28 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల్ని తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కెమికల్ విభాగంలో 10 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు, 6 మెకానికల్ మేనేజ్‌మెంట్ ట్రైనీలో పోస్టులు, 3 ఎలక్ట్రికల్ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు, 3 ఇన్‌స్ట్రుమెంటేషన్ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు, 2 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రైనీ పోస్టులు, 1 లా మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టు, 3 హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆర్‌ఎఫ్‌సిఎల్ వెబ్ సైట్ https://www.rfcl.co.in కెరీర్స్ విభాగంలో పూర్తి వివరాలను చూడొచ్చు. మార్చి 14 వరకు ఉద్యోగ దరఖాస్తులను స్వీకరిస్తారు.
We’re now on WhatsApp. Click to Join
ఆర్‌ఎఫ్‌సీఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే దరఖాస్తులను(Ramagundam Fertilizers) స్వీకరిస్తారు. నోటిఫికేషన్ సవరణ, అనుబంధ నోటిఫికేషన్, మార్పుల గురించి వెబ్‌సైట్‌ను మాత్రమే అనుసరించాలి. ఆర్‌ఎఫ్‌సీఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మార్చి 10 వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలో ప్రొడక్షన్ విభాగంలో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2, మెకానికల్ విభాగంలో అసిస్టెంట్ గ్రేడ్2,ఎలక్ట్రికల్,ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్ లాబ్, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అన్ని విభాగాల్లో కలిపి 35 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. రిజర్వేషన్ల వారీగా పోస్టుల వివరాలు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ
రైల్వే శాఖలోని వివిధ జోన్లలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు సమీపిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనేందుకు ఇంకా ఆరు రోజులు మాత్రమే (ఫిబ్రవరి 19 అర్ధరాత్రి 11.59 గంటల వరకు) గడువు ఉంది. ఆఖరి నిమిషం వరకు వేచి చూసి ఇబ్బందిపడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని రైల్వేశాఖ సూచిస్తోంది. విద్యార్హతల విషయానికొస్తే.. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసినవారూ అర్హులే. అంతేకాక ఇంజినీరింగ్ పూర్తి చేసినవాళ్లూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వేతనం విషయానికి వస్తే.. అసిస్టెంట్ లోకో పైలట్(ALP) ఉద్యోగానికి ఎంపికైన వారికి తొలుత రూ.19,900 నుంచి వేతనం అందుతుంది. ఇతర సౌకర్యాలు ఉంటాయి. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయస్సు జులై 1, 2024 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. కేటగిరీల వారీగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.