Site icon HashtagU Telugu

MLC Vijayashanthi : విజయశాంతికి బెదిరింపులు

Man Threatens To Kill Mlc V

Man Threatens To Kill Mlc V

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి( MLC Vijayashanthi)కి బెదిరింపులు (Threats) రావడం సంచలనంగా మారింది. ఆమెకు చెందిన సోషల్ మీడియా ఖాతాలను గతంలో నిర్వహించిన చంద్రశేఖర్ (CHandrasekhar) అనే వ్యక్తి, డబ్బులు ఇవ్వాలంటూ మెసేజ్‌లు పంపించి బెదిరించినట్టు సమాచారం. డబ్బులు చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ప్రాణాలకు ముప్పు వస్తుందని మెసేజ్‌ల్లో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో విజయశాంతి, ఆమె భర్త ఎం.వి. శ్రీనివాస ప్రసాద్ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Vanajeevi Ramaiah : వనజీవి మరణంపై తెలుగు ముఖ్యమంత్రులు విచారం

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు చంద్రశేఖర్‌పై విచారణ ప్రారంభించారు. ఫిర్యాదు ఆధారంగా అతని పంపిన మెసేజ్‌లు, కాల్ డేటా తదితర ఆధారాలు సేకరిస్తున్నారు. విజయశాంతి భర్త ఎం. వి శ్రీనివాస ప్రసాద్‌కు నాలుగేళ్ల క్రితం ఎం చంద్రకిరణ్‌ రెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను సోషల్‌ మీడియాలో ప్రమోషన్స్‌ చేస్తానని చంద్రకిరణ్‌ చెప్పుకున్నాడు. పనితీరు చూశాక కాంట్రాక్ట్‌ ఇస్తామని చంద్రకిరణ్‌కు శ్రీనివాస ప్రసాద్‌ చెప్పాడు. కొద్దిరోజుల తర్వాత అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో అతడితో ఎలాంటి ఒప్పందం చేసుకోకుండా పంపించేశారు. కానీ చంద్రకిరణ్‌ మాత్రం తాను విజయశాంతి కోసం సోషల్‌ మీడియాలో పనిచేస్తున్నాని చెప్పుకుంటూ పలువురు రాజకీయ ప్రముఖుల వద్ద కాంట్రాక్టులు కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం.. తనకు డబ్బులను ఎప్పుడు చెల్లిస్తారంటూ శ్రీనివాసప్రసాద్‌కు చంద్రకిరణ్‌ రెడ్డి మెసేజ్‌ చేశాడు. ఎటువంటి ఒప్పందం లేకుండానే చంద్రకిరణ్‌ డబ్బులు అడగడంతో ఇంటికొచ్చి మాట్లాడాలని శ్రీనివా్‌సప్రసాద్‌ మెసేజ్‌లో సూచించగా, అతడు రాలేదు. ఇటీవల ‘‘నాకు డబ్బులు ఇవ్వకపోతే మీ బతుకులు రోడ్డు కీడుస్తా.. కసితీరే వరకు అతి దారుణంగా చంపుతాను’’ అంటూ చంద్ర కిరణ్‌ రెడ్డి మెసేజ్‌ ద్వారా బెదిరించాడు.

AP Inter Results: నేడు ఏపీ ఇంటర్‌ ఫలితాలు.. సులభంగా పొందొచ్చు ఇలా!

ప్రస్తుతం ఈ ఘటనపై కాంగ్రెస్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజా ప్రతినిధులపై ఇలాంటి బెదిరింపులు పెరిగిపోతున్నాయని అభిప్రాయపడుతున్నాయి. పోలీసు దర్యాప్తు వేగంగా జరగాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ రాజకీయవర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. మరింత సమాచారం దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.