Police Patrolling Vehicle: మామూలోడు కాదు.. పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్‌నే ఎత్తుకెళ్లాడు.!

సూర్యాపేటలో గుర్తుతెలియని వ్యక్తి పోలీసుల పెట్రోలింగ్ వాహనాన్ని (Police Patrolling Vehicle) దొంగిలించాడు. కొత్తబస్టాండ్ సెంటర్ లో దుండగుడు పోలీసుల వాహనాన్ని (Police Patrolling Vehicle) అపహరించారు.

Published By: HashtagU Telugu Desk
Police Patrolling Vehicle

Cropped (6)

సూర్యాపేటలో గుర్తుతెలియని వ్యక్తి పోలీసుల పెట్రోలింగ్ వాహనాన్ని (Police Patrolling Vehicle) దొంగిలించాడు. కొత్తబస్టాండ్ సెంటర్ లో దుండగుడు పోలీసుల వాహనాన్ని (Police Patrolling Vehicle) అపహరించారు. అయితే చోరీకి గురైన వాహనాన్ని కోదాడలో గుర్తించి.. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ చెందిన TS 09 PA 0658 పోలీస్ వాహనం సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద చోరీకి గురైన సంఘటన గురువారం చోటుచేసుకుంది.

Also Read: Suicide Attempt: నిజామాబాద్‌లో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకరి మృతి

గురువారం తెల్లవారుజామున 5 గంటలకు ఈ సంఘటన చోటుచేసుకుంది. గస్తీ విధులు నిర్వహిస్తున్న పోలీసులు వేరే కేసు కోసం వాహనాన్ని నిలిపి వెళ్లగా చోరీ జరిగింది. ఆ సమయంలో వాహనానికి తాళం ఉండడంతో తీసుకెళ్లిన గుర్తుతెలియని దుండగుడు. కోదాడ వద్ద దుండగుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వాహనం స్వాధీనం చేసుకున్నారు.కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.

  Last Updated: 15 Dec 2022, 12:10 PM IST