Site icon HashtagU Telugu

Free Bus for Ladies : బస్సుల్లో పురుషులకు సీట్లు కేటాయించాలని వ్యక్తి నిరసన..

Man Protest Infront Of Bus

Man Protest Infront Of Bus

తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress) ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యం (Telangana Free Bus Travel Scheme) కల్పించింది. దీంతో మహిళలంతా ఏంచక్కా బస్సుల్లో ప్రయాణం చేస్తూ రాష్ట్రం మొత్తం చుట్టేస్తున్నారు. ఇదే తరుణంలో పలు విధాలుగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఈ ఫ్రీ పధకం పెట్టేసరికి ఇంట్లో ఆడవారు ఉండడం లేదని చిన్న , చితక పనులకు కూడా టౌన్ లకు వెళ్తున్నారని..పక్కింటి ఆవిడా షాప్ కు రమ్మన్నదని, సినిమాకు రమన్నదని ఇలా బస్సు ప్రయాణం చేస్తున్నారని చెపుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఆటో డ్రైవర్లు ఫ్రీ బస్సు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మా పొట్ట కొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆర్టీసీ బస్సులలో పురుషులకు కొన్ని సీట్లు కేటాయించాలని ఓ వ్యక్తి ధర్నాకు దిగాడు. ఆర్మూర్‌లో వాసు అనే వ్యక్తి బస్సు ముందు నిలబడి పురుషులకు బసు లో కొన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ… ఆర్టీసీ బస్టాండ్ నిరసన చేపట్టాడు. వాసు నిరసనకు చాలామంది మగవారు మద్దతు తెలిపారు. డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్న మీము నిల్చుని పోవాలి..ఫ్రీ గా ప్రయాణం చేసేవాళ్ళు హాయిగా సీట్లలో కూర్చుని ప్రయాణం చేస్తున్నారని మండిపడ్డారు. ఆడవారికి సగం..మగవారికి సగం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేసారు.

Read Also :Medaram Maha Jatara : మహా జాతరకు రూ.75కోట్ల విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం