లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు ఆగడం లేదు. హైదరాబాద్‌లో లోన్ యాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేధింపులకు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు సి రవీందర్ యాదవ్‌గా పోలీసులు గుర్తించారు. రవీందర్ యాదవ్ ఆన్‌లైన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. రవీంద్ర ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి అతని కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చి చూడగా రవీందర్ యాదవ్ ఉరివేసుకుని కనిపించాడు. రవీంద్ర మృతదేహాన్ని కిందకు దించి సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. రవీంద్ర అప్పులు చేసి తిరిగి చెల్లించలేకపోయాడని మృతుడి బంధువులు ఫిర్యాదు చేశారు. మృతుడికి ఫోన్ కాల్స్ వచ్చాయని లోన్ యాప్ వాళ్లు బెదిరించారని వారు ఆరోపించారు . బెదిరింపుల కారణంగానే రవీందర్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Loan App Harassment : లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి

Loan App