ప్రస్తుతం టెక్నాలజీ (Technology) ఎంతగా అభివృద్ధి చెందిందో తెలియంది కాదు..ప్రతి వాటికీ మెడిసిన్ అందుబాటులో ఉంది. చిన్న గాయం దగ్గరి నుండి గుండె మార్పిడి వరకు అత్యాధునిక పరికరాలతో డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వైద్యం పట్ల శ్రద్ద వహిస్తున్నారు. మారుమూల గ్రామాల్లోను చిన్న చిన్న హాస్పటల్స్ ను అందుబాటులో ఉంచుతున్నారు. ఇలాంటి క్రమంలో కూడా కొంతమంది మూఢనమ్మకాలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ..ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి పాముకాటుకు (Snake Bite) గురై..హాస్పటల్ కు వెళ్లకుండా ఆకుపసరు మింగి ప్రాణాలు విడిచిన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని షేర్ శంకర్ తండాలో చోటుచేసుకుంది.
గత నాల్గు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో మారుమూల గ్రామాల్లో పాముల బెడద ఎక్కువైపోయింది. అడవులను వదిలి జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆలా కామారెడ్డి (Kamareddy District)జిల్లా రాజంపేట మండలంలోని షేర్ శంకర్ తండాలో ఇంట్లో నిద్రిస్తున్న కుమారుడు వినోద్ (12)ని మొదట పాము కరిచింది. ఇది గమనించిన తండ్రి రవి (40) పామును చంపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో రవిని సైతం పాము కాటు వేసింది. అయితే ఆస్పత్రికి వెళ్లకుండా స్థానికంగా ఏదో ఆకు పసరు వేసుకుని.. తమకు ఏమీ కాదనే నమ్మకంతో ఉన్నారు.
ఇంతలోనే వినోద్ ప్రాణాలు కోల్పోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు.. రవిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవి కూడా ప్రాణాలు కోల్పోయాడు. పాము కరిచిన వెంటనే ఆసుపత్రికి తరలించి ఉంటే ఇద్దరి ప్రాణాలు నిలిచేవని కుటుంబసభ్యులు వాపోయారు. టెక్నాలజీ ఇంతగా ఉన్నప్పుడు కూడా ఇలా మూఢనమ్మకాలతో ప్రాణాలు పోగొట్టుకోవడం అందర్నీ కలిచివేస్తుంది.
Read Also : Bodybuilder Justyn Vicky : జిమ్ లో మెడ విరిగి ట్రైనర్ మృతి..