Hyd : వేటకొడవల్లతో నడిరోడ్డుపై హత్య..భయపడుతున్న నగరవాసులు

హైదరాబాద్ (Hyderabad) లో ఇటీవల మధ్య వరుస హత్యలు , అత్యాచారాలు నగరవాసులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ఓ యువతీ ఫై ఐదుగురు అత్యాచారం (Gang Rape) చేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవ్వగా..తాజాగా నిన్న రాత్రి ఓ రియల్ ఎస్టేట్ వ్యక్తిని దారుణంగా నడిరోడ్డు ఫై వేటకొడవల్లతో అతి దారుణంగా హత్య (Murder) చేయడం ఇప్పుడు వార్తల్లో హైలైట్ నిలిచింది. We’re now on WhatsApp. Click to […]

Published By: HashtagU Telugu Desk
Man Brutally Hacked To Deat

Man Brutally Hacked To Deat

హైదరాబాద్ (Hyderabad) లో ఇటీవల మధ్య వరుస హత్యలు , అత్యాచారాలు నగరవాసులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ఓ యువతీ ఫై ఐదుగురు అత్యాచారం (Gang Rape) చేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవ్వగా..తాజాగా నిన్న రాత్రి ఓ రియల్ ఎస్టేట్ వ్యక్తిని దారుణంగా నడిరోడ్డు ఫై వేటకొడవల్లతో అతి దారుణంగా హత్య (Murder) చేయడం ఇప్పుడు వార్తల్లో హైలైట్ నిలిచింది.

We’re now on WhatsApp. Click to Join.

ఎస్ఐ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహమ్మద్ సాదిక్ అలీ ఖాద్రి (Ali Quadri) అనే వ్యక్తి ఫ్యామిలీ నివాసం ఉంటున్నారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో తన ఇంటి వద్ద అరుగుపై వచ్చి కూర్చున్నాడు. అదే క్రమంలో అక్కడికి బైక్ పై గుంపులుగా కొంతమంది వచ్చారు. అయితే ఖాద్రి వారిని అంతగా పట్టించుకోలేదు. అయితే ఒక్కసారిగా వారందరూ ఖాద్రి పై దాడి చేశారు. అడ్డుగా కారు వున్న ఖాద్రి తప్పించుకునేందుకు ప్రయత్నించినా ఆ వ్యక్తులు దాడి చేస్తునే వున్నారు. వారితో తెచ్చుకున్న వేటకొడవల్లను బయటకు తీసి అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఒకరి తరువాత ఒకరు అతనిపై వేట కొడవళ్లతో దాడి చేయడంతో మహమ్మద్ ఖాద్రి గట్టిగా కేకలు వేసిన ఎవరూ బయటకు రాలేదు.

అర్థరాత్రి కావడంతో ఎవరూ అతని అరుపులు పట్టించుకోలేదు. అయితే ఖాద్రిపై వేటకొడవల్లతో దాడి చేయడంతో అతను సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. బయటకు వెళ్లిన వ్యక్తి..ఇంకారావడం లేదని కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూడగా రక్తపు మడుగులో ఉన్న ఖాద్రి ని చూసి షాక్ అయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాడరు. విషయం తెలుసుకున్న సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ మనోహర్ తో పాటు చాంద్రాయన గుట్ట ఏసిపి సంఘటన స్థలానికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు క్లూస్ టీంను రంగంలో కి దింపి ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.

Read Also : Siddaramaiah Counter To KTR : కేటీఆర్ కు సిద్దరామయ్య కౌంటర్ .. మీకు ఏది ఫేకో..ఏదో నిజమో తెలియదు

  Last Updated: 19 Dec 2023, 01:02 PM IST