Site icon HashtagU Telugu

Marri Rajasheker Reddy : పార్టీ మారాలనే.. మా మామపై ఐటీ దాడులు..!!

Marri

Marri

పార్టీ మారాలన్న ఒత్తిడితోనే మా మామ మల్లారెడ్డిపై ఐటీ దాడులు జరిగాయంటూ మంత్రి మల్లా రెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకే ఈ దాడులు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా పార్టీ మారాలనే చేస్తున్న రచ్చా అన్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఇవాళ మీడియాతో మాట్లాడారు రాజశేఖర్ రెడ్డి. ఇవాళ ఉదయం టర్కీ నుంచి రాగానే…మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాజకీయ కక్షతోనే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. తన నివాసంలో నాలుగు కోట్లు సీజ్ చేసినట్లు చెప్పారు.

కాలేజీల్లో వేతనాల కోసం నెలకు కనీసం కోటిరూపాయలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఐటీ సోదాలకు తామూ పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. చట్టపరంగా అన్నిట్యాక్సులు చెల్లిస్తున్నామని చెప్పారు. తాను ఇంట్లో లేని సమయంలో ఈ ఐటీ దాడులు చేయడం…కుటుంబ సభ్యలు పట్ల దారుణంగా వ్యవహారించడం బాధగా ఉందన్నారు. చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటానని చెప్పారు.