హైదరాబాద్, ఆగస్టు 9 : మాజీ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) రాజకీయాలకు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో మేడ్‌వియా తో మాట్లాడిన మల్లారెడ్డి, తాను ఇక రాజకీయాలలో కొనసాగనని స్పష్టం చేశారు.
“నేను బీజేపీ, తెలుగుదేశం, లేదా బీఆర్ఎస్ పార్టీలలో ఏ వైపునా ఉండటానికి ఆసక్తి చూపించడం లేదు. నేను ఇప్పటికీ బీఆర్ఎస్‌లోనే ఉన్నానని చెప్పగలుగుతాను. కానీ, నాకు ప్రస్తుతం రాజకీయాలకు అవసరం లేదు,” అని మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు.
పార్టీ మార్పు లేదా రాజకీయాలపై మార్పు చేసే దిశగా ఏ నిర్ణయాలు తీసుకోవడం లేదని, తనకు 73 సంవత్సరాలు వచ్చాయని, ఇంకా ఏ వైపునా చూడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
తాను ఈ మధ్య కాలంలో ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసిన మల్లారెడ్డి, ఇక రాజకీయాల్లో మూడేళ్లు మాత్రమే ఉంటానని చెప్పడంతో, తన ఆశయాన్ని గురించి కూడా వివరించారు.
“ప్రజలకు సేవ చేసే దిశగా నేను నా ప్రగతిని కొనసాగించాలనుకుంటున్నాను. మంచి కాలేజీలు, యూనివర్సిటీలు స్థాపించడం నా లక్ష్యంగా ఉంది,” అని మల్లారెడ్డి పేర్కొన్నారు.