బిఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) ఫై మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఎస్సి , ఎస్టీ కేసు (SC,ST Case) తో పాటు 420 కేసు నమోదు అయినా సంగతి తెలిసిందే. చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్ 33 34 35లో గల 47 ఎకరాల 18 గంటల ఎస్టి (లంబాడీల) వారసత్వ భూమిని మల్లారెడ్డి వారి బినామీ అనుచరులు 9 మంది అనుచరులు అక్రమంగా కబ్జా చేసారని, కుట్రతో మోసగించి భూమిని కాజేసారని శామీర్ పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు గిరిజనలు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. దీనిపై మల్లారెడ్డి స్పందించారు. భూ కబ్జాతో తనకు ఎటువంటి సంబంధం లేదని, కేసు నమోదైన విషయం వాస్తవమేనని అన్నారు. అయితే ఇది ప్రభుత్వ కక్షకాదన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని మల్లారెడ్డి స్పష్టం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
బాధితుడు కేతావత్ బిక్షపతి నాయక్ వారసత్వంగా వచ్చిన భూమి ఆరుగురిపై ఉందన్నారు. ఈ భూమిపై కన్నేసిన మల్లారెడ్డి ఈ భూమిని ఎలాగైనా కాజేయాలని కుట్రతో తన అనుచరులైన శ్రీనివాసరెడ్డి హరిమోహన్ రెడ్డి , మధుకర్ రెడ్డి , శివుడు , స్నేహరామిరెడ్డి రామిలి, లక్ష్మమ్మ , రామిడి నేహా రెడ్డిలు మాకు మాయ మాటలు చెప్పి కుట్రతో మమ్మల్ని నమ్మించి మీ భూమి మీకు వస్తుందని ఆశ చూపి మమ్మల్ని నమ్మించి అబద్ధాలు చెప్పి నిరక్ష్య రాస్యులైన మాతో రూ. 250 కోట్ల విలువ చేసే భూమిని పీటీ సరెండర్ చేయించారని పేర్కొన్నారు. మా భూమిపై మేము హక్కులు కోల్పోయేలా చేసి ఎస్టీ లంబాడీలమైన మాపై అట్రాసిటీ పాల్పడ్డారన్నారు. ఆరోజు మాకు ఏడు మందికి ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున డబ్బు ఇచ్చారన్నారు. మల్లారెడ్డి ఆదేశాలతో రాత్రి 11 గంటలకు శామీర్ పేట్ తహసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్, సబ్ రిజిస్టర్ వాణి రెడ్డి అక్రమంగా 47.18 ఎకరాల భూమినీ మల్లారెడ్డి అనుచరులపై రిజిస్టర్ చేశారని వారు ఆరోపించారు.
Read Also : Smita Sabharwal Tweet : మీడియా లో ప్రచారం అవుతున్న వార్తలపై స్మితా సభర్వాల్ క్లారిటీ..