KCR Warns Mallareddy: ‘మల్లారెడ్డి మందు పార్టీ’పై కేసీఆర్ సీరియఎస్

మునుగోడులో ఎన్నికల ప్రచారంలో కొందరు మంత్రులు లిక్కర్ పార్టీలు ఏర్పాటు చేసి షో చేయడంపై తెలంగాణ ముఖ్యమంత్రి

  • Written By:
  • Updated On - October 13, 2022 / 10:57 AM IST

మునుగోడులో ఎన్నికల ప్రచారంలో కొందరు మంత్రులు లిక్కర్ పార్టీలు ఏర్పాటు చేసి షో చేయడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా మద్యం విక్రయాలకు లైసెన్స్ లేని ప్రైవేట్ హోటల్‌లో మంత్రి మల్లారెడ్డి తన పార్టీ సహచరులకు మద్యం అందించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

మల్లారెడ్డికి ఫోన్ చేసి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మల్లా రెడ్డి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారని, అయితే కేసీఆర్ ఆయనపై మండిపడ్డారని సమాచారం. ఇలాంటి చర్యల ద్వారా అధికార పార్టీకి చెడ్డపేరు రాకుండా చూడాలన్నారు. ప్రభుత్వ ప్రతిష్టకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. ఈ విషయమై ఆయన ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సమాచారం.

Also Read:   TS : ఉన్నత విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి..తెలంగాణ సర్కార్ నిర్ణయం..!!

హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా ప్రగతి భవన్‌కు అత్యంత సన్నిహితంగా భావించే ఎమ్మెల్యేల్లో ఒకరు మహిళతో అసభ్యకరంగా లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. పార్టీకి చెడ్డపేరు రాకుండా ఉండేందుకు సదరు ఎమ్మెల్యేను హడావుడిగా అక్కడి నుంచి వెనక్కి పంపించాల్సి వచ్చింది.