తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion)పై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా, వాటిని ఎవరికివ్వాలనే అంశంపై అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తూ బీసీ, రెడ్డి, ముస్లిం, ఎస్సీ సామాజిక వర్గాలకు మంత్రిపదవులు కేటాయించే అవకాశముందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో చోటు పొందే నేతల పేర్లు హాట్ టాపిక్‌గా మారాయి.
IPL 2025: ఈ ఐపీఎల్‌లో కోహ్లీని ఊరిస్తున్న భారీ రికార్డులివే..
తాజాగా తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy), కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి(Gaddam Vivek Venkatswamy) ని అభినందించడంతో, ఆయనకు మంత్రి పదవి ఖరారైందనే ఊహాగానాలు బలపడాయి. మల్లారెడ్డి సరదాగా “మొత్తానికి సాధించారు.. సీఎం, డిప్యూటీ సీఎం కంటే ముందే ఢిల్లీ వచ్చారు” అంటూ వ్యాఖ్యానించగా, దీనికి వివేక్ “నేను వేరే పని మీద వెళ్లాను” అని సమాధానమిచ్చారు. అయితే మల్లారెడ్డి మాత్రం “ఇప్పుడంతా మీ రాజ్యమే.. మాది నడవడం లేదు” అంటూ మరింత ఆసక్తికరంగా స్పందించారు.
ATM Charges Hike: ఏటీఏం వాడే వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. మే 1 నుంచి ఛార్జీల మోత!
ఈ మాటలతో వివేక్‌కు మంత్రి పదవి ఖాయమనే సంకేతాలు మరోసారి స్పష్టమయ్యాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడంతో, దీని కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో గడ్డం వివేక్ వెంకటస్వామి పేరు అధికారికంగా ప్రకటిస్తారా? అన్నది వేచి చూడాలి.