CM Revanth : మల్లారెడ్డి కాళ్లబేరానికి వచ్చినట్లేనా..?

  • Written By:
  • Publish Date - March 7, 2024 / 03:33 PM IST

అధికారం అనేది ఎవరికీ ..ఎప్పుడు శాశ్వతం కాదు. అధికారం చేతిలో ఉందికదా అని ఏది చేసిన..ఏం మాట్లాడిన చెల్లదు. ఒన్స్ అధికారం పోయిందా..అంతే సంగతి. ప్రస్తుతం బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (MallaReddy) పరిస్థితి కూడా అలాగే ఉంది. పాలమ్మిన.. పూలమ్మిన..కష్టపడ్డా అంటూ వేదికలపై పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పి బాగానే ఆకట్టుకున్నాడు కానీ..నిజంగా అవి అమ్మితే అన్ని ఆస్తులు రాలేదనేది అందరికి తెలిసిందే. ఎక్కడిక్కడే భూకబ్జాలు , సెటిలెమెంట్స్ చేసి ఈరోజు కోట్ల ఆస్థి సంపాదించాడు. మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ , స్కూల్స్ అబ్బో మల్లన్న గట్టిగానే వెనకేసుకున్నాడు. ఇక పదేళ్ల పాటు అధికారం చేతిలో ఉండడం ఆయన పాడిందే పాట..ఆడిందే ఆటగా సాగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం తో మల్లన్న కు అసలైన ఆట ను సీఎం రేవంత్ చూపిస్తున్నాడు. దీంతో మల్లన్న కాళ్లబేరానికి వచ్చినట్లు అర్ధం అవుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

మల్లారెడ్డి చిన్న దామర చెరువు కబ్జా చేసి భవనాలు నిర్మించారని తేలడంతో హైదరాబాద్ దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ, ఏరోనాటికల్ భవనాలను రెవిన్యూ అధికారాలు గురువారం ఉదయం నుండి కూల్చడం మొదలుపెట్టారు. రాజశేఖర్ రెడ్డి చెరువును ఆక్రమించి కాలేజ్‌లో కొన్ని నిర్మాణాలు చేశారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో దుండిగల్, గండి మైసమ్మ మండల రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు ఆధ్వర్యంలో కూల్చివేతలు జరిగాయి. గతంలో గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ లే అవుట్ లో మల్లారెడ్డి సంబంధించిన కాలేజీ రోడ్డును అధికారులు తొలగించారు. ఇలా వరుసగా ప్రభుత్వం నుండి ఎదురుదెబ్బలు వస్తుండడం తో ఇక ప్రభుత్వం (Congress Govt) ఫై విమర్శలు చేస్తే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన మల్లన్న..నేడు సీఎం రేవంత్ సలహాదారు వేం నరేందర్ ( Vem Narender Reddy) తో మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి భేటీ అయినట్లు సమాచారం. రాజశేఖర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీల్లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చేస్తున్న క్రమంలో వీరు సీఎం సలహాదారుతో భేటీ అవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. మల్లారెడ్డి, ఆయన అల్లుడు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి కూల్చడం ఆపేస్తామని హామీ ఇస్తే వీరు కాంగ్రెస్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో..!!

Read Also : CM Revanth Reddy Brother : గుండెపోటుకు గురైన సీఎం రేవంత్ తమ్ముడు