Mallareddy : నా ఇంట్లో రూ. 28 లక్షలే దొరికాయి..ఐటీ దాడులతో నాకు మరింత ఇమేజ్..!!

  • Written By:
  • Updated On - November 25, 2022 / 11:35 AM IST

తెలంగాణమంత్రి మల్లారెడ్డి నివాసంతోపాటు ఆయన సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. నవంబర్ 22న షురూ అయిన ఐటీ సోదాలు గురువారంతో ముగిశాయి. ఆదాయపన్ను శాఖ దాడుల నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఐటీదాడుల్లో ప్రస్తుతం మొదటి ఎపిసోడ్ పూర్తి అయ్యింది. భవిష్యత్తులో రెండు, మూడో ఎపిసోడ్స్ ఉంటాయి. అప్పుడు మళ్లీ కలుద్దాం. ఎన్నడూ లేనివిధంగా దారుణంగా దాడులు చేశారు. నన్ను నా కుటుంబాన్ని చాలా ఇబ్బందులకు గురిచేశారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఎవరి భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ్టి నుంచి హాయిగా నిద్రపోతాను అని మల్లారెడ్డి అన్నారు.

గురువారం ఐటీ అధికారుల సోదాలు ముగిసిన తర్వాత తన నివాసం వద్ద మంత్రి మీడియా సమావేవం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 1994 , 2008 ఇప్పుడు ఐటీ దాడులు జరిగినట్లుగా వెల్లడించారు. మొదటిసారి దాడులతో కొంత ఇమేజ్ పెరిగిందని…రెండోసారి అది రెట్టింపు అయ్యిందని..ఇప్పుడు మూడోసారి దేశవ్యాప్తంగా మరింత ఇమేజ్ వచ్చిందని కామెంట్ చేశారు. 20సంవత్సరాలుగా ఇంజనీరింగ్ కళాశాలలను నడుపిస్తున్నా…మల్లారెడ్దీ నువ్వు యూనివర్సిటీ పెట్టు, ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు పెట్టు అంటూ ఎంతో మంది చెప్పుకొచ్చారని వెల్లడించారు.

టీఆర్ఎస్ మంత్రిని కావడంతోనే ఈ ఐటీ దాడులు జరిగాయని ఆరోపించారు. నేను ఎలాంటి మోసాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేయలేదు. పేదవారికి నాణ్యమైన విద్యాను అందిస్తున్నాను. మధ్యతరగతి వారికి ఇంజనీరింగ్ విద్యను అందుబాటులోకి తెచ్చాను. నా పేరు ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఐటీ దాడులు చేయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేవారు. ఎవరెన్నీ కుట్రలు పన్నినా కేసీఆర్ చూసుకుంటారు. ఆయన నాకు ముందే చెప్పారు ఐటీ దాడులు చేస్తారని మల్లారెడ్డి వెల్లడించారు. బీజేపీ రాజకీయ కుట్రతోనే ఇలాంటివి చేయిస్తుందని మండిపడ్డారు. మాకు కేసీఆర్ ఉన్నారు. మా నాయకుడున్నంత వరకు మమ్మల్ని ఎవరేం చేయలేరు అంటూ వ్యాఖ్యానించారు.