Site icon HashtagU Telugu

Malla Reddy : ‘బర్రె’తో మల్లారెడ్డి ముచ్చట..పాలమ్మిన సీన్ రిపీట్

Mallareddy Funny Conversati

Mallareddy Funny Conversati

మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy) గురించి కొత్తగా ఎంత చెప్పిన తక్కువే..మల్లన్న ఎంత మాటకారో చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఏదోకదానితో వార్తల్లో నిలువడం ఈయన ప్రత్యేకత. రాజకీయాల్లోనైనా , వ్యక్తిగతంగానైనా , వేడుక ఏదైనా సరే..మల్లారెడ్డా..మజాకానా అన్న తీరుగా ఈయన వ్యవహార శైలి ఉంటుంది. కేవలం సభలు , సమావేశాల్లోనే కాదు సోషల్ మీడియా లోను ఈయనకంటూ ఓ ప్రత్యేక అభిమానులు ఉంటారు. నిత్యం ఈయన చేసే కామెంట్స్ ను వైరల్ చేస్తూ అందరి చేత నవ్వులు తెప్పిస్తుంటారు. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల ప్రచారంలోనూ తనదైన శైలి లో ప్రచారం చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. మొన్నటికి మొన్న మల్కాజ్ గిరి లో ఈటెల రాజేందరే గెలుస్తాడంటూ చెప్పి షాక్ ఇచ్చారు..ఆ తర్వాత ఆలా ఎందుకు అనాల్సి వచ్చిందో వివరించారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా బర్ల కొట్టం వద్దకు వెళ్లి బర్రె తో ముచ్చటించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్ధతుగా మాజీ మంత్రి మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ బర్ల కొట్టం వద్దకు వెళ్లారాయన. అక్కడ బర్రెల వద్దకు వెళ్లి వాటికి పచ్చి గడ్డి తినిపించే ప్రయత్నం చేశారు. ‘ఆ.. ఆ.. ఆ.. జర తిను ఒక బుక్క’ అని మల్లారెడ్డి అన్నారు. మరోవైపు.. జనాలు ఎక్కువగా ఉండటంతో ఆ బర్రెలు భయంతో బెదురుతున్నాయి. దాంతో వారిని పక్కకు జరగాలని వారించారు మల్లారెడ్డి. ఆ తరువాత మరోసారి బర్రెలకు గడ్డి తినపెట్టే ప్రయత్నం చేశారు. ‘నేను నీ మల్లన్నను.. చిన్నప్పుడు నీకు సేవ చేసినా..’ అంటూ ఎన్నికల ప్రచారంలో నవ్వులు పూయించారు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో ను చూసిన వారంతా మల్లన్న పాత రోజులు గుర్తు చేసుకున్నట్లుందంటూ ఆయన ఫేమస్ డైలాగ్స్ పాలమ్మిన.. పూలమ్మిన.. కష్టపడ్డ అనే డైలాగ్ ను గుర్తు చేసుకుంటున్నారు.

Read Also : MLA Raja Singh : బిజెపి సభలో ఎమ్మెల్యే రాజాసింగ్ కు అవమానం..