Site icon HashtagU Telugu

BRS 25th Anniversary : స్టెప్పులేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

Mallareddy Dance

Mallareddy Dance

బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ(BRS 25th Anniversary)ను ఘనంగా నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు ఎడ్ల బండ్లు, కార్లు, బస్సులు ఏసుకొని ఓరుగల్లు వైపు తరలిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల విజయ యాత్రను జరుపుకుంటున్న సందర్భంగా వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎల్కతుర్తి సభా ప్రాంగణం పూర్తిగా గులాబీ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ రజతోత్సవ సభకు పది లక్షలమంది వరకు వస్తారని అంచనా.

Virat Kohli: విరాట్ కోహ్లీకి ఇష్ట‌మైన దేవుడు ఎవ‌రో తెలుసా?

ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) తనదైన శైలిలో మరోసారి వార్తల్లో నిలిచాడు. శామీర్‌పేట్ మండలం అలియాబాద్ చౌరస్తా వద్ద పార్టీ కార్యకర్తలతో కలిసి మల్లారెడ్డి స్టెప్పులేసి సందడి చేశాడు. పార్టీ శ్రేణులలో కొత్త ఉత్సాహం నింపాడు. సిల్వర్ జూబ్లీ సభ కోసం వెళ్లుతున్న మల్లారెడ్డి జానపద నృత్యాలతో అక్కడి జనం దృష్టిని ఆకర్షించాడు. ఇది గులాబీ సైన్యంలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చిందని కార్యకర్తలు చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ మరోసారి తన సత్తా చూపించేందుకు సిద్ధమైంది. రజతోత్సవ సభ ద్వారా ప్రజలకు తమ విజన్‌ను వివరించబోతున్నామని, కొత్త చరిత్ర సృష్టించబోతున్నామని పార్టీ నాయకులు ధీమాగా చెబుతున్నారు. వరంగల్ సభ అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో గణనీయమైన మార్పులు వస్తాయంటూ గులాబీ నేతలు భావిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల కళ్లంతా ఇప్పుడు ఈ సభపైనే నిలిచాయి.