మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆకక్తికర వ్యాఖ్యలు చేసారు. ఐటీ పరిశ్రమకు మాజీ మంత్రి కేటీఆర్ పెద్ద పీట వేశారని , ఆయన లేని లోటు ఐటీ పరిశ్రమలో కనిపిస్తుందని , కేటీఆర్ లేని హైదరాబాద్‌ను ఐటీ ఉద్యోగులు చూడలేకపోతున్నారు అని తనదైన శైలి లో కామెంట్స్ చేసారు.
తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీఎం రేవంత్ తనదైన మార్క్ పాలన కొనసాగిస్తూ ప్రజల్లో నమ్మకం పెంచుతున్నారు. అయితే ఐటీ విషయంలో చాలామంది ఖంగారుపడుతున్నారు. హైదరాబాద్ లో ఐటీ సంస్థలను తీసుకరావడం లో గత ప్రభుత్వం విజయం సాధించింది. ఈ విజయం లో కీలక పాత్ర కేటీఆర్ (KTR) దే అని చెప్పాలి.
We’re now on WhatsApp. Click to Join.
హైదరాబాద్ లో ఐటీ ని మొదటగా పరిచయం చేసింది చంద్రబాబు (Chandrababu) అయితే..పూర్తిస్థాయిలో హైదరాబాద్ లో విస్తృతం చేసింది మాత్రం కేటీఆర్ అనే చెప్పాలి. ఒక్క హైదరాబాద్ లోనే కాదు రాష్ట్రంలోని అనేక జిల్లాలో ఐటీ హబ్ (IT Hub) లను తీసుకొచ్చి ఎంతగానో డెవలప్ చేసారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. నిరంతరం ఐటీ ఉద్యోగులతో సోషల్ మీడియా వేదికగా టచ్‌లో ఉంటూ.. ‘ఫ్రెండ్లీ మినిస్టర్’ అనే పేరు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో ఐటీ ఎలా ఉండబోతుందో అనే టెన్షన్ చాలామందిలో ఉంది. ఇదే విషయాన్నీ తాజాగా మల్లారెడ్డి చెప్పుకొచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని ఒక్కటే వేడుకుంటున్న.. హైదరాబాద్‌లో ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలను కాపాడాలని అన్నారు. సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ను ఈరోజు మల్లారెడ్డి (Malla Reddy) పరామర్శించారు. కేటీఆర్‌ను కలిసి కేసీఆర్ ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ పరిశ్రమకు మాజీ మంత్రి కేటీఆర్ పెద్ద పీట వేశారని గుర్తుచేశారు. ఆయన లేని లోటు ఐటీ పరిశ్రమలో కనిపిస్తుందని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఓడిపోతారని ఎవరూ భావించలేదన్నారు. ఆయన ఓడిపోయినందుకు అందరూ బాధపడుతున్నట్లు చెప్పారు. కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడుతుందని, మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశముందన్నారు.
Read Also : Ponnala Lakshmaiah : కేసీఆర్ ను రేవంత్ కలవడం ఫై పొన్నాల సెటైర్లు