Malla Reddy : ఈటెల గెలుపు అనే మాట ఫై క్లారిటీ ఇచ్చిన మల్లారెడ్డి

ఎదురు పడిన మనిషిని మాట వరుసకు నువ్వే గెలుస్తావ్ అని అన్న.. అంతే తప్ప నిజంగా ఆయన గెలుపును కోరలేదు

Published By: HashtagU Telugu Desk
Malareddy Etela

Malareddy Etela

మాజీ మంత్రి , మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy) తాజాగా చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ (BRS) శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రస్తుతం తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల (Lok Sabha Poll) వార్ ..సమ్మర్ ను మించి తలపిస్తుంది. నువ్వా..నేనా అన్నట్లు అధికార – ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు , ఆరోపణలు చేసుకుంటూ మరింత వేడి పుట్టిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..ఈసారి లోక్ సభ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని చూస్తుంది. ఈ క్రమంలో కేంద్రంలోని బిజెపి ఫై , ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఫై కేసీఆర్ నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. ఈ తరుణంలో మాజీ మంత్రి , మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి..అధిష్టాన నిబంధనను బ్రేక్ చేసాడు.

We’re now on WhatsApp. Click to Join.

మల్కాజిగిరి నియోజకవర్గం (Malkajigiri Constituency)లో జరిగిన ఒక ఫంక్షన్ కు మల్లారెడ్డి తో పాటు బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ (Etela Rajendar) హాజరయ్యారు. ఈ సందర్బంగా ఒకరికారు కలుసుకొని , ఆప్యాయంగా ఒకరితో మరొకరు ఫోటో దిగారు. ఈ క్రమంలో మల్కాజ్ గిరిలో ఈసారి నువ్వే గెలుస్తున్నవ్ అన్నా.. అంటూ మల్లారెడ్డి మాట్లాడుతూ హత్తుకున్నాడు. ఈ వ్యాఖ్యలు విని ఈటెల తో పాటు ఆయన వర్గీయులు సంతోషం వ్యక్తం చేస్తే..మల్లారెడ్డి పక్కనున్న బిఆర్ఎస్ శ్రేణులు షాక్ కు గురి అయ్యారు. మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గంలోనే మల్లారెడ్డి అల్లుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మల్కాజ్ గిరిలో మొతం ఏడు సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంది. అలాంటి చోట బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని మల్లారెడ్డి బహిరంగంగా ప్రకటించడం అంత చర్చగా మారింది. మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై మల్లారెడ్డి రియాక్ట్ అయ్యారు.

ఎదురు పడిన మనిషిని మాట వరుసకు నువ్వే గెలుస్తావ్ అని అన్న.. అంతే తప్ప నిజంగా ఆయన గెలుపును కోరలేదు. అసలు ఈటెల రాజేందర్, మల్కాజ్ గిరికి ఏంచేసాడు..? ఆయనకు ఇక్కడ ఓటు లేదు..? అసలు ఆయనది మల్కాజ్ గిరి కాదు.. ఈటెల రాజేందర్ నాన్ లోకల్.. అంటూ మల్లారెడ్డి చెప్పుకొచ్చారు.

Read Also : Sarathi Studios : సరికొత్త టెక్నాలజీతో పున:ప్రారంభమైన సారథి స్టూడియోస్‌

  Last Updated: 27 Apr 2024, 12:08 PM IST