Congress: కాంగ్రెస్ పార్టీలోకి మల్లా రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి..?

  • Written By:
  • Updated On - March 8, 2024 / 01:46 PM IST

 

Congress: మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLA) మల్లారెడ్డి(Mallareddy), ఆయన అల్లుడు, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(Marri Rajasekhar Reddy)బీఆర్ఎస్(BRS) పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ(Congress party)లోకి చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డితో భేటీ అయినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలకు ముందే మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విద్యా సంస్థల బిల్డింగ్ లు ప్రభుత్వ భూముల్లో ఉన్నాయంటూ అధికారులు కూల్చేసిన విషయం తెలిసిందే. మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో వీటిపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదులు ఆధారంగా అధికారులు చర్యలు మొదలు పెట్టారు. తాజాగా భవనాల కూల్చివేతల నేపథ్యంలో మల్లారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్నమొన్నటి వరకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి తన కుమారుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని మల్లారెడ్డి చెప్పుకుంటూ వచ్చారు.

read also: Job Calendar : ఇక ఏటా టీఎస్​పీఎస్సీ జాబ్‌ క్యాలెండర్‌.. రెడీ అవుతున్న ముసాయిదా

తాజా పరిస్థితుల నేపథ్యంలో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదని, ఆ ఆలోచన లేదని మల్లారెడ్డి చెప్పడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి సిద్ధమవుతున్నారని, అందుకు సంకేతంగానే మల్లారెడ్డి అలా వ్యాఖ్యానించి ఉంటారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.